కత్తి నన్ను రేప్ చేయబోయాడు.. నటి సునీత - MicTv.in - Telugu News
mictv telugu

కత్తి నన్ను రేప్ చేయబోయాడు.. నటి సునీత

April 14, 2018

కత్తి మహేష్‌కి పవన్‌కి మధ్య ఇష్యూ జరుగుతున్నప్పుడు కత్తి ఓ టీవీ ఛానల్ లైవ్‌లోనే పలువురు అమ్మాయిలతో చాట్ చేసినట్టు చెప్పాడు. నాకు ఆ అమ్మాయితో సెక్స్ చేయాలనిపించింది.. అడిగాను. ఇందులో తప్పేముంది ? ఇది హ్యూమన్ సైకాలజీ అని చెప్పాడు కత్తి. కట్‌చేస్తే ఇప్పుడు తగుదునమ్మా అంటూ కాస్టింగ్ కౌచ్‌పై పోరాడుతున్న శ్రీరెడ్డికి మద్దతుగా నిలబడ్డాడు. అమ్మాయిలను ఇండస్ట్రీలో ఘోరంగా వాడుకుంటున్నారని సత్య పలుకులు పలికాడు. దయ్యాలే వేదాలు వల్లిస్తాయని కత్తి గురించి చాలామంది సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించారు.  

ఈ నేపథ్యంలో సునీత అనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ కత్తి క్యారెక్టర్ గురించి మీడియా ముందుకొచ్చి అతని ముందే చెప్పింది. ఓ టీవీ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న సునీత అతని గురించిన ఆసక్తికర విషయాలు బయట పెట్టింది. తనను ఒకసారి వాళ్లింటికి రమ్మని పిలిచాడని.. గదిలోకి పిలిచి తనను బలవంతం చేశాడని.. తనను కొట్టాడని వెల్లడించింది.

‘ నాకు ఫేస్‌బుక్ ద్వారా కత్తి పరిచయమయ్యారు. ఒకసారి ‘ అమీతుమీ ’ ఆడియో ఫంక్షన్‌లో కలిసినప్పుడు ఆయనకు చాలా క్రేజ్ వుందేమో అనుకున్నా. అప్పుడు ఆయనకు పవన్ కల్యాణ్‌కు మధ్య ఇష్యూ నడుస్తోంది. అలాంటి ఆయనకు బిగ్‌బాస్ షోలో ఆఫర్ రావటం ఏంటో అని ఆశ్చర్యపోయాను. ఆ షో నుంచి ఈయన ఎలిమినేషన్ అయ్యాక.. నేను మీ బిగ్‌బాస్ చూశాను సార్. చాలా బాగుంది అని కాల్ చేసి చెప్పాను. బిగ్‌బాస్ షోలో ఫోన్‌లో మాట్లాడినపుడు మీ వైఫ్‌తో లక్నోకి వెళ్తాను అన్నారు కదా.. ఎందుకు హైదరాబాద్‌కి వచ్చారు అని అడిగాను. ‘నాపై ఎక్కువ కాంట్రవర్సీలు వచ్చాయి కదా బిగ్‌బాస్‌లో అందుకే వెనక్కి వచ్చాను ’ అన్నారు. నన్ను కలుస్తావా అని అడిగింది కూడా ఆయనే.

 ఒకసారి నన్ను పిలిచి వాళ్లింటి బయట మాట్లాడాడు. ఆ తర్వాత నన్ను రమ్మని ఫేస్‌బుక్‌లో అడ్రస్ పెట్టాడు. కావాలంటే నేను ఫేస్‌బుక్‌లో మెసేజ్ చూపిస్తా. వెళ్లాక తన విశ్వరూపం చూపించాడు. కమిట్‌మెంట్ ఇస్తావా? అని అడిగాడు. దానికి నేను అంగీకరించకపోయే సరికి కోపంగా నన్ను కొట్టి డోర్ వేసి.. బలవంతం చేశాడు. తర్వాత బస్ టికెట్‌కి రూ. 500 ఇచ్చి పంపించాడు. అందుకు సంబంధించిన ప్రూఫ్‌లు నా దగ్గర వున్నాయి ’ అంటూ సునీత పేర్కొంది. ఆమె వ్యాఖ్యలను పక్కనే కూర్చున్న కత్తి సింపుల్‌గా నవ్వేసి కొట్టిపారేయటం గమనార్హం. అప్పట్లో కత్తి అమ్మాయిలతో చాట్ చేసింది నిజమే అని తేలింది.