‘ ప్రజాకీయ ’ పార్టీ పెట్టిన ఉపేంద్ర - MicTv.in - Telugu News
mictv telugu

‘ ప్రజాకీయ ’ పార్టీ పెట్టిన ఉపేంద్ర

March 7, 2018

కన్నడ నటుడు అన్నట్టుగానే తన పార్టీ వీడారు. రాజకీయాల్లో ప్రజలే ప్రభువులని, ప్రతి రూపాయికి లెక్క చెప్పాలని, ప్రజా రాజకీయాలే నడపాలని ప్రకటిస్తూ కేపీజేపీని ఆరంభించారు ఉపేంద్ర. కేపీజేపీ పార్టీ స్థాపించిన ఆరు నెలల్లోనే చీలికలు ఏర్పడ్డ కారణంగా ఆ పార్టీకో దండం పెట్టి, రాజీనామా చేసి బయటకు వచ్చారు. ఆ వెంటనే ‘ ప్రజాకీయ ’ అనే మరో పార్టీకి ప్రాణం పోశారు.  గత ఏడాది అక్టోబర్‌ 31న బెంగళూరులో పార్టీ పురుడు పోసుకోవడం తెలిసిందే. పార్టీ అధ్యక్షులు ఉపేంద్రకు, వ్యవస్థాపకుడు మహేష్‌గౌడకు మధ్య భేదాభిప్రాయాలు తలెత్తడంతో ఉపేంద్ర కేపీజేపీకి రాజీనామా చేశారు. ఉపేంద్ర సూచించిన అభ్యర్థులను ఎన్నికల బరిలో దింపితే కనీసం 20 ఓట్లు కూడా రాలవని మహేష్‌గౌడ అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. నేతలు వైఖరి నచ్చక ఉపేంద్ర కొంతకాలంగా పార్టీకి దూరంగా వుంటున్నారు.‘ నేటితో కేపీజేపీతో బంధం తెగిపోయింది, కేపీజేపీ పార్టీతో ఇక నాకు ఎలాంటి సంబంధం లేదు  ’ అని వాఖ్యానించారు. ‘ మహేశ్‌గౌడకు నచ్చజెప్పడానికి ఎంతో ప్రయత్నించాము. అయితే ఆయనకు పార్టీ శ్రేయస్సు, ప్రజాసేవ కంటే పబ్లిసిటీనే కావాలన్నట్లు అర్థమయింది. నేను ఏ పార్టీలో చేరడం లేదు. సొంతంగా ‘ ప్రజాకీయ ’ పేరుతో కొత్త పార్టీని స్థాపించనున్నాము. నేటి నుంచే ప్రజాకీయ పార్టీ కార్యకలాపాలు ప్రారంభించాం ’ అని తెలిపారు. తమతోపాటు తమ సిద్ధాంతాలు నచ్చిన మరికొంత మంది నేతలు, కార్యకర్తలు కూడా కేపీజేపీ పార్టీకి రాజీనామా చేసి ప్రజాకీయ పార్టీలో చేరారన్నారని తెలిపారు. నిస్వార్థ రాజకీయాలే లక్ష్యంగా తమ పార్టీ పనిచేస్తుంది.. అలాంటి భావాలున్నవాళ్ళే ప్రజాకీయ పార్టీలో వుంటారని పేర్కొన్నారు.