‘మహానటి’ మరో లుక్ వచ్చేసింది - MicTv.in - Telugu News
mictv telugu

‘మహానటి’ మరో లుక్ వచ్చేసింది

March 14, 2018

మహానటి ’ సినిమాకు సంబంధించిన పోస్టర్ వచ్చింది. సావిత్రి పాత్రలో కీర్తిసురేష్, జెమినీ గణేషన్ పాత్రలో దుల్కర్ సల్మాన్ పోస్టర్ మీద మెరిసిపోతున్నారు. వీణ పట్టుకున్న దుల్కర్ పక్కన కీర్తిసురేష్ అచ్చు సావిత్రిలా చిరునవ్వులు చిందిస్తూ నిలుచుంది. కీర్తిసురేష్ జన్మదినం సందర్భంగా ఫస్ట్‌లుక్ విడుదలైన విషయం తెలిసిందే.

మహానటి సావిత్రి బయోపిక్‌గా వస్తున్న ఈ సినిమాలో సమంత, విజయ్ దేవరకొండ ముఖ్య పాత్రల్లో నటిస్తుండటం విశేషం. ‘ ఎవడే సుబ్రమణ్యం ’ ఫేమ్ నాగ్ అశ్విన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఎన్టీఆర్ పాత్ర కోసం జూనియర్ ఎన్టీఆర్‌ను చిత్ర యూనిట్ సంప్రదించినట్టు సమాచారం. ఏఎన్నార్ పాత్రకోసం విజయ్‌ను తీసుకున్నారు. దర్శకుడు క్రిష్‌, ప్రకాశ్‌‌రాజ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాను దివంగత నటి శ్రీదేవికి అంకితం ఇస్తున్నట్టు నిర్మాత సి. అశ్వనీదత్ ప్రకటించిన విషయం తెలిసిందే. అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసుకొని త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.