పెళ్లి రద్దు చేశారని.. రాయితో మోది హత్య!   - MicTv.in - Telugu News
mictv telugu

పెళ్లి రద్దు చేశారని.. రాయితో మోది హత్య!  

January 30, 2018

భవిష్యత్తులో పోలీస్ కానిస్టేబుల్ కావాలని కలలు కన్నది అనూష. కానీ ఆమె కలల్ని చిదిమేశాడో నీచుడు. ఆమె తలపై బండరాయితో మోది దారుణంగా హత్య చేశాడు. హైదరాబాద్ శివారులోని హయత్ నగర్‌లో ఈ దారుణం జరిగింది.  

అనూష స్వస్థలం నల్లగొండ జిల్లాలోని దేవరకొండ. 2016లో బీటెక్ పూర్తి చేసి కొంతకాలంగా నగరంలో ఉంటూ ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతోంది. ఈ క్రమంలో మూడు రోజులు కిందట ఆమె హత్యకు గురైంది. అనూషకు నాలుగు నెలల కిందట మోతీలాల్ అనే వ్యక్తితో నిశ్చితార్థం జరిగింది. అయితే మోతీలాల్ ప్రవర్తన నచ్చన అనూష కుటుంబం ఈ పెళ్లిని రద్దు చేసుకుంది.  దీన్ని మనసులో పెట్టుకుని మోతీలాలే అనూషను చంపాడని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఉద్యోగం పేరుతో అతడు అనూషను హైదరాబాద్ కు తీసుకొచ్చి ఓ అద్దె గదిలో ఉంచాడని, అతడే ఆమెను చంపాడని చెబుతున్నారు.

గోనె సంచిలో ముక్కలుగా మహిళ శవం :కొండాపూర్‌లోని శ్రీరాంనగర్‌ కాలనీ బొటానికల్ గర్డెన్ సమీపంలో గోనె సంచిలో ముక్కలుగా మహిళ శవం లభ్యమైంది. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గోనె సంచిని తెరిచి చూశారు. మృతురాలు మహిళ అని నిర్ధారించారు. ఆమె ఎవరు, ఆమెను ఎవరు ఎందుకు చంపారు అన్న కోణంలో పోలీసలు నిందుతుల కోసం వేట మొదలు పెట్టారు.