అటు ఎంబీబీఎస్.. ఇటు సర్పంచ్‌గా గ్రామసేవ - MicTv.in - Telugu News
mictv telugu

అటు ఎంబీబీఎస్.. ఇటు సర్పంచ్‌గా గ్రామసేవ

March 21, 2018

ఎంబీబీఎస్ చదివి డాక్టర్ అవుతారు ఎవరైనా.. డాక్టర్ చదివినవారు యార్టర్లము అయ్యామని కొంతమంది యాక్టర్లు అంటుంటారు. కండక్టర్ నుండి సూపర్‌స్టార్ అయిన రజినీకాంత్ గురించి మనందరికీ తెలిసిందే. కానీ ఇక్కడ మీకో ఎంబీబీఎస్ సర్పంచ్‌ను పరిచయం చేస్తున్నాం. ఎంబీబీఎస్ చదివి సర్పంచ్ అయిన ఆమె పేరు షహనాజ్ ఖాన్. రాజస్థాన్‌లోని భరత్‌పూర్ జిల్లా, కమాన్ గ్రామ పంచాయతీకి ఈ నెల 5న షహనాజ్ ఖాన్ సర్పంచ్‌గా ఎన్నికై చరిత్ర సృష్టించింది. ఆమె ఎంఎల్ఏగా ఎన్నికైన తొలి మియో ముస్లిం మహిళ అయిన కాంగ్రెస్ నేత జైదా ఖాన్ కుమార్తె అవడం గమనార్హం. రాజకీయ నేపథ్యం ఉన్న  కుటుంబంలోంచి వచ్చిన నాలుగో తరం వ్యక్తి ఆమె. షహనాజ్ మొరాదాబాద్‌లోని వైద్య కళాశాలలో మెడిసిన్ చదువుతూనే సర్పంచ్‌గా గెలిచింది.పంజాబ్, రాజస్థాన్, హర్యానా రాష్ట్రాల నుంచి ఎంఎల్ఏగా ఎన్నికైన భారతదేశంలోని ఏకైక రాజకీయ వేత్త తయ్యబ్ హుస్సేన్‌కి ఆమె మనుమరాలు. గత నాలుగేళ్ళుగా కమాన్ గ్రామ సర్పంచ్‌గా షహనాజ్ తాత హనీఫ్ ఖాన్ వున్నారు. అటు చదువు, ఇటు సర్పంచ్ పదవికి ఎలా న్యాయం చేస్తారని మీడియా అడగ్గా.. గురుగ్రామ్‌లో తాను ఇంటర్న్‌షిప్‌ చేయాల్సి ఉందని, తన స్వగ్రామం నుంచి అక్కడకు వెళ్లడానికి గంటన్నర సమయం పడుతుందని ఆమె చెప్పారు. అందువల్ల ఇంటర్న్‌షిప్‌ కోసం మధ్యాహ్నం వరకు, ఆ తర్వాత సమయాన్ని గ్రామ సేవ కోసం వినియోగిస్తానని షహనాజ్ వివరించింది. ఎంబీబీఎస్ చదువుతున్న ఆమె సర్పంచ్ అవటం వల్ల గ్రామంలో ఎవరికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా తీరుస్తుంది.. గ్రామం ఆరోగ్యంగా వుంటుందని గ్రామస్థులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.