కేసీఆర్ ఫ్యామిలీ నుంచి సుమంత్‌కు ఫోన్... - MicTv.in - Telugu News
mictv telugu

కేసీఆర్ ఫ్యామిలీ నుంచి సుమంత్‌కు ఫోన్…

December 8, 2017

 

సుమంత్‌కు చాలా రోజుల తరువాత మంచిరోజులు వచ్చాయి. . తాజాగా విడుదలైన అతని చిత్రం  ‘ మళ్ళీరావా ’ కు ప్రశంసల ఝల్లులు మొదలయ్యాయి. ఈ క్రమంలో సుమంత్‌కు కేసీఆర్ కుటుంబం నుంచి వచ్చిన మెసేజ్‌తో ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు.  

‘  తెలంగాణ సీఎం కుటంబం నుంచి తనకు మెసేజ్ వచ్చింది. ఈ సినిమా ప్రింటును పంపించమని కోరారు.. పంపుతున్నాను ‘ అని సుమంత్ తన ట్విట్టర్ ద్వారా తెలిపి, తన ఆనందాన్ని పంచుకున్నాడు. అయితే ఆ మెసేజ్ ఎవరి నుండి వచ్చింది సుమంత్ తెలుపలేదు. సినిమాలు బాగుంటే తొలుత పొగిడేది మంత్రి కేటీఆరే. గతంలో పెళ్ళిచూపులు, నిన్నుకోరి, ఫిదా సినిమాలు బాగున్నాయని కేటీఆర్ ట్విట్టర్లో పేర్కొన్నారు. ఈ మెసేజ్ కూడా ఖచ్చితంగా ఆయన నుండే వచ్చుంటుందని కామెంట్లు చేస్తున్నారు నెటిజనులు.

ఇదిలా వుండగా చాలామంది సుమంత్‌కు ఫోన్లల్లో, మెసేజ్‌లలో తనకు అభినందనలు తెలియజేస్తున్నారు. చాలా రోజుల తరువాత సుమంత్‌కు పునర్వైభవాన్ని ఇచ్చిన సినిమా మళ్ళీరావా. ఈ సినిమాలో ఆకాంక్ష సింగ్‌ సుమంత్‌కి జోడీగా నటించింది. కాగా, ఈ సినిమా చాలా బాగుంద‌ని యువ‌న‌టుడు సుధీర్ బాబు ట్వీట్ చేశాడు. సుధీర్‌కి థ్యాంక్స్ చెబుతూ ఆ ట్వీట్‌ను సుమంత్ రీ ట్వీట్ చేశాడు. గౌతమ్ తిన్నసూరి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకుల ఆదరణ రోజురోజుకు పెరుగుతున్నది.