కూతురి ప్రేమపెళ్లి.. వద్దంటూ ఏడ్చిన ఎమ్మెల్యే - MicTv.in - Telugu News
mictv telugu

కూతురి ప్రేమపెళ్లి.. వద్దంటూ ఏడ్చిన ఎమ్మెల్యే

March 10, 2018

కూతురి ప్రేమ వివాహం ఆ తల్లిదండ్రులకు నచ్చలేదు. ఎలాగైనా ఆమె మనసు మార్చాలనివిశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ ఆ కూతురు వినలేదు. ప్రేమించునోడితోనే నా జీవితం అంది. దీంతో ఎమ్మెల్యే అయిన ఆ తండ్రి చిన్నపిల్లాడిలా భోరుమన్నాడు.

ఈ ఘటన కర్ణాటకలోని యలహంకలో జరిగింది.  కన్నబడ్డ ప్రేమవివాహాన్ని వ్యతిరేకించింది దావణగెరె జిల్లా మాయకొండ ఎమ్మెల్యే, సినీ నిర్మాత శివమూర్తి నాయక్‌. శివమూర్తి నాయక్ కొన్నిరోజుల క్రితం తన కుమార్తె లక్ష్మీనాయక్ కనిపించటంలేదని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇంతలో ఆయన కూతురు స్వయంగా పోలీసుల ముందకు వచ్చి తను సుందరగౌడను ప్రేమించి చాముండి కొండపై వివాహం చేసుకున్నట్టు తెలిపింది.   

గత ఏడేళ్ళుగా ప్రేమించుకున్నామని లక్ష్మి  తెలిపింది. ఇంట్లో తమ ప్రేమను ఒప్పుకోకపోవటంతో ఇలా పారిపోయి వివాహం చేసుకున్నామంది. ఆమె భర్త మాట్లాడుతూ ‘ మా మామ తీసిన మాస్తిగుడి సినిమా షూటింగ్‌లోనే మాకు పరిచయం ఏర్పడింది. క్రమంగా  ఇష్టాలు కలిసి ప్రేమించుకున్నాం ’ అన్నాడు.  ఇరువురూ మేజర్లమేనన్నారు. వీరి వెంట సినీనటుడు దునియా విజయ్‌ కూడా ఉన్నారు.

పోలీస్ స్టేషన్‌లో కుమార్తె మనసు మార్చాలని ప్రయత్నించి విఫలమయ్యారు కన్నవాళ్ళు. లక్ష్మీనాయక్‌ను ఒప్పించే యత్నంలో తల్లీ, అవ్వలు ఆ అమ్మాయి కాళ్ళుపట్టుకున్నారు. అయినా ఆమె మనసు మార్చుకోనంది..  దీంతో ఎమ్మెల్యే గుక్కపట్టి ఏడ్చారు. లక్ష్మీనాయక్‌ అవ్వ ఒక్కసారిగా స్టేషన్‌లోనే కుప్పకూలిపోగా ఆసుపత్రికి తరలించారు.