నన్ను ఎమ్మెల్యే రేప్ చేశాడు..! - MicTv.in - Telugu News
mictv telugu

నన్ను ఎమ్మెల్యే రేప్ చేశాడు..!

February 3, 2018

భోపాల్‌లో ఓ యువతి తనపై కాంగ్రెస్ ఎమ్మెల్యే హేమంత్ కటారే అత్యాచారం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్యే తనపై చాలాసార్లు అత్యాచారానికి పాల్పడ్డారని, ఒకసారి కారులోనే లైంగిక దాడి చేశాడని ఆమె తెలిపింది. అంతేకాదు ఓ మహిళా పోలీస్ అధికారి సాయంతో తనపై తప్పుడు కేసు బనాయించారని ఆమె వాపోయింది.హేమంత్ కటారే తనపై అత్యాచారం జరిపిన వీడియో అంటూ ఓ క్లిప్‌ను బాధితురాలు బయటపెట్టింది. గుణ ఎంపీ, కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియా ముఖ్య అనుచరుడిగా ముద్రపడిన హేమంత్ వ్యవహారం మధ్యప్రదేశ్‌లో ఆ పార్టీకి ఇప్పుడు తలనొప్పిగా మారింది.కాగా అంతకు ముందే ఆ యువతిపై క్రైం బ్రాంచ్ పోలీసులకు ఎమ్మెల్యే ఫిర్యాదు చేశాడు. ఆమె తనపై ఉత్తి పుణ్యానికి కేసు పెట్టి నన్నుఅప్రతిష్ట పాలు చెయ్యాలని చూస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ‘ 21 ఏళ్ళున్న సదరు యువతి జర్నలిజం కోర్స్ చేస్తున్నది. కాగా ఆమెకు, తనకు సాన్నిహిత్యం వున్న సందర్భంలో ఆమె రెండు వీడియోలు తీసింది. ఆ వీడియోలను పట్టుకొని నా దగ్గర రూ. 5 కోట్లు కావాలని బ్లాక్ మెయిల్ చేస్తోందని. తను అడిగినంత ఇవ్వకపోతే నామీద రేప్ కేస్ పెడతానని బెదిరించింది. నేను రూ 5 లక్షలు మాత్రమే ఇస్తానని చెప్పాను.. దీంతో నామీద కేసు పెట్టింది’ అని ఎమ్మెల్యే తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

ఈ క్రమంలో గతనెల 24న ఆమెను పోలీసులు అరెస్ట్ చేయటం గమనార్హం. జర్నలిజం చదువుకొని తన తెలివితేటలను ఇలా అడ్డదారుల్లో ఉపయోగించుకొని అడ్డంగా బుక్కై గత నెల 24 జైలుకెళ్లిందని పోలీసులు వివరించారు.