వీడో మానవ మృగం… భర్త రూపంలో ఉన్న రాక్షసుడు - MicTv.in - Telugu News
mictv telugu

వీడో మానవ మృగం… భర్త రూపంలో ఉన్న రాక్షసుడు

November 25, 2017

అగ్నిసాక్షిగా పెళ్ళి చేసుకున్న భార్యను స్నేహితులకు అప్పగించి తమాషా చూశాడు. ఇదంతా కేవలం విడాకుల కోసం ఆడిన దుర్మార్గం. భార్య విడాకులు ఇవ్వమంటే ఇవ్వడంలేదని  దుర్మార్గుడు దోస్తులతో కలిసి, ప్లాన్ చేసి భార్యను సామూహిక అత్యాచారం చేయించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పంజాబ్‌లోని లూధియానాలో బాధితురాలు మూడేళ్ళ క్రితం కూలి పని చేసే వ్యక్తిని పెళ్ళి చేసుకున్నది. ఇద్దరికీ అది రెండో వివాహం. పిల్లలంటే ఇష్టం లేని ఆ వ్యక్తి బాధితురాలికి 8 సార్లు అబార్షన్ చేయించాడు. చివరికి ఏకంగా పిల్లలే కాకుండా ఆపరేషన్ కూడా చేయించాడు. అయినా ఆమె సహించింది.

అంతటితో ఆగకుండా నీతో కలిసుండటం ఇష్టం లేదు విడాకులు కావాలని వేధించడం మొదలు పెట్టాడు. అందుకు ఆమె తిరస్కరించింది. తన మాట నెగ్గడం లేదనే అక్కసుతో, ఎలాగైనా తనను వదిలించుకోవాలని గత జూన్ 6న తన దోస్తులను తీస్కొచ్చి భార్య వున్న గదిలోకి పంపి బయటనుండి తాళం వేశాడు. కామంతో కళ్ళు మూసుకుపోయిన ఆ కామాంధులు స్నేహితుడి భార్య అని కూడా చూడకుండా రెచ్చిపోయి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీనిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసినా వాళ్ళు పట్టించుకోలేదు. తాజాగా ఇది మరోమారు వివాదంగా మారేసరికి సామూహిక అత్యాచారం కింద కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.