‘నీదీ నాదీ ఒకే కథ’ ఇలా... - MicTv.in - Telugu News
mictv telugu

‘నీదీ నాదీ ఒకే కథ’ ఇలా…

December 8, 2017

యువ దర్శకుడు వేణు ఊడుగుల రచన, దర్శకత్వంలో వస్తున్న సరికొత్త సినిమా ‘నీదీ నాదీ ఒకే కథ’.  ‘అరన్ మీడియా వర్క్స్’  బ్యానర్‌పై హీరో నారా రోహిత్ సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రం మోషన్ పోస్టర్ విడుదలైంది.

అప్పట్లో ఒకడుండేవాడు’ ఫేం శ్రీవిష్ణు, ‘బిచ్చగాడు’ ఫేం సాత్నా టైటస్, పోసాని కృష్ణ మురళి, దేవీ ప్రసాద్ ( కెవ్వు కేక దర్శకుడు ) ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతాన్ని అందిస్తున్నారు. ‘ఫ్రెండ్స్ పర్సనాలిటీ డెవ్‌లప్‌మెంట్’ అనే మెరికతో, కాలిపోతున్న పుస్తకాల మంటల్లోంచి శ్రీవిష్ణు ముఖం కనిపిస్తూ విడుదలైన ఈ మోషన్ పోస్టర్ సోషల్ మీడియాలో చాలా మందిని ఆకట్టుకుంటున్నది.

త్వరలో విడుదల అవుతున్న టీజర్ కోసం ఎదురుచేసేలా మోషన్ పోస్టర్ వుంది. ప్రశాంతి, కృష్ణ విజయ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు కెమెరా ‘ అర్జున్ రెడ్డి ’ సినిమాకు పని చేసిన రాజ్ తోట, పర్వేజ్‌లు చేస్తున్నారు.