ఎంపీ కొత్తపల్లి గీతకు  దమ్కీ మేయిల్స్ - MicTv.in - Telugu News
mictv telugu

ఎంపీ కొత్తపల్లి గీతకు  దమ్కీ మేయిల్స్

November 23, 2017

చిన్న చేపలను పడితే లాభం లేదు పెద్ద చేపలను పడితేనే వర్కౌట్ అవుతుందనుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు. పోయీ పోయీ ఎంషి కే ఎసరు పెట్టాలనుకొని బోల్తా పడ్డాడు. విశాఖపట్నం జిల్లా అరకు ఎంపీ కొత్తపల్లి గీతకు ఓ ఆంగతుకుడు మెయిల్స్‌లో తనను తాను ఏసీబీ అధికారిగా పరిచయం చేసుకున్నాడు. ఆమె బ్యాంకు లావాదేవీలు, వ్యక్తిగత ఆస్తులపై ఏసీబీకి ఫిర్యాదు వచ్చిందని నమ్మించాడు. వివరాలు కావాలంటే తన ఎస్బీఐ అకౌంటులో డబ్బులు వేయాలంటూ మెయిల్స్‌లో పేర్కొన్నాడు. అతని మాటలు తేడాగా అనిపించిన ఎంపీ..  ద్వారక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వెంటనే సైబర్ క్రైం పోలీసులు రంగప్రవేశం చేశారు. ‘ ఇలాంటి ఫేక్ మెయిల్స్ ఈ మధ్య తనకే కాకుండా చాలా మంది ఎంపీలకు వస్తున్నాయని చెప్పారు. తన కుమారుడి అకౌంటు నుండి రూ. 12 వేలు మాయమయ్యాయన్నారు. ఇది జరిగి ఎనిమిది నెలలు అయినా బ్యాంకు వాళ్ళు ఇంకా చర్యలు తీసుకోలేదు. వీటిని కేంద్ర హోంమంత్రి దృష్టికి తీసుకు వెళతాను. పార్లమెంటులో కూడా సైబర్ క్రైం అంశాన్ని ప్రస్తావిస్తానని ’ అన్నారు.

కాగా ఈమధ్యే నిజామాబాదు ఎమ్మెల్సీ ఆకుల లలితకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. బాలాజీ నాయుడనే వ్యక్తి సెక్రటేరియట్ నుంచి ఫోన్ చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.2 కోట్ల నిధులు వచ్చాయని నమ్మబలికాడు. అయితే రెండు కోట్లు కావాలంటే ముందుగా రూ.10 లక్షలు బ్యాంక్ అకౌంట్‌లో డిపాజిట్ చేయమన్నాడు. తీరా చూస్తే అది ప్రైవేట్ అకౌంట్ కావడంతో డౌట్ వచ్చి సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతను సైబర్ నేరగాడని తెలిసింది.