భార్యా బిడ్డలను పొట్టన పెట్టుకున్న దుర్మార్గుడు - MicTv.in - Telugu News
mictv telugu

భార్యా బిడ్డలను పొట్టన పెట్టుకున్న దుర్మార్గుడు

February 5, 2018

నగరంలోని మీర్‌పేట జిల్లెలగూడలో దారుణం చోటుచేసుకుంది. కట్టుకున్న భార్యతో పాటు కన్నబిడ్డలు ఇద్దర్నీ హతమార్చాడో దుర్మార్గుడు. అనంతరం  పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయాడు. వివరాల్లోకి వెళితే మీర్‌పేట్‌ సుమిత్ర ఎన్‌క్లేవ్ లో నివాసం ఉంటున్న హరీందర్‌ గౌడ్‌…భార్య జ్యోతి, కుమారుడు అభితేజ్‌ (6), కుమార్తె  సహస్ర(5)ను గొంతు నులిమి అతి దారుణంగా హత్య చేశాడు.ఆ తరువాత కాలనీ వాసులకు తాను తన ఫ్యామిలీని హత్య చేశానని చెప్పి, నేరుగా మీర్‌పేట పీఎస్‌లో లొంగిపోయాడు. కాగా  కొద్దిరోజుల క్రితమే హరీందర్‌ ఉద్యోగం మానేసినట్లు తెలుస్తోంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి, వివరాలు సేకరిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.