పోలీస్ స్టేషన్లోనే జాతీయ పతాకానికి అవమానం - MicTv.in - Telugu News
mictv telugu

పోలీస్ స్టేషన్లోనే జాతీయ పతాకానికి అవమానం

February 7, 2018

జాతీయ పతకానికి జరగరాని చోటే అవమానం జరిగింది. శాంతి భద్రతలను రక్షించే పోలీస్ స్టేషన్‌లోనే ఘోర అవమానం ఎదురైంది. నగరంలోని మారేడ్‌పల్లి పోలీస్ స్టేషన్‌ దీనికి వేదికైంది. స్టేషన్‌ లోపల గాల్లో రెపరెపలాడుతూ ఎగురుతున్న  జాతీయ పతాకాన్ని కిందపడేసి అవమాన పరిచాడో కానిస్టేబుల్. ఈనెల 3 న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ఈనెల 3న సాయంత్రం 6.03గంటల ప్రాంతంలో పి. వెంకట్ నరేశ్ అనే కానిస్టేబుల్ స్టేషన్ రూఫ్ పైకి ఎక్కి జెండాను కిందికి లాగేశాడు. జెండా కింద పడి వుండటాన్ని ఓ వ్యక్తి ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయటంతో ఈ విషయం వైరల్‌గా మారింది.  

స్టేషన్‌కు దగ్గరలో నివాసం ఉండే అన్వర్ అనే వ్యక్తి జెండా కింద ఉండటం గమనించి.. ఫొటో తీసి వాట్సాప్‌లో షేర్ చేశాడు. ఫోటో కాస్తా వైరల్‌గా మారటంతో విషయం వాళ్ళ దగ్గరికే వెళ్ళింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అసలు విషయాన్ని కనుగొన్నారు. బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని పోలీసులు పేర్కొన్నారు.