ఈమెది తుమ్మితే రాలిపడే ముక్కు అయినా చింతించదు - MicTv.in - Telugu News
mictv telugu

ఈమెది తుమ్మితే రాలిపడే ముక్కు అయినా చింతించదు

April 10, 2018

చాలా మంది తమ శరీర లోపాలను చూసి బాధపడుతుంటారు. కానీ ఒకామె మాత్రం తన శరీరంలో సంభవించిన లోపాన్ని చూసి బాధ పడుతూ అస్సలు కూర్చోలేదు. తన లోపాన్ని తానే పదే పదే గుర్తు చేసుకుంటూ నవ్వుతూ, నవ్విస్తూ వుంటుంది. ఆమె పేరే జేన్. ప్రస్తుతం ఆమె కృత్రిమ ముక్కుతో కాలం వెళ్ళదీస్తోంది. కృత్రిమ ముక్కు అంటే పుట్టుకతోనే ఆమెకు వచ్చింది కాదు. తను ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న పెంపుడు కుక్క వల్లే తన ముక్కు కోల్పోయింది జేన్. అందమైన ముక్కును కుక్క కొరికేసిందని ఆ కుక్క మీద కూడా పగ పెంచుకోలేని విచిత్రమైన మనస్తత్వం గలది జేన్.

కుక్కలన్నాక గాయం చేస్తాయి, అది వాటి సహజ గుణం అన్న భావనతో తనకు తగిలిన గాయాన్ని కూడా పట్టించుకోలేదు జేన్. కుక్క కరిచిన 6 నెలల తర్వాత క్రమక్రమంగా ముక్కునుండి రక్తం కారడం, తద్వారా అనేక క్లిష్ట పరిస్థితులను ఎదుర్కుంది జేన్. వెంటనే ఆసుపత్రికి వెళ్లింది. కానీ డాక్టర్లు ఆమెకు అక్కడ దిమ్మదిరిగే సమాధానం ఇచ్చారు. ముక్కును తొలగించడం కన్నా ప్రత్యాన్మాయం లేదని చెప్పారు. అయినా జేన్ భయపడలేదు.. చింతించలేదు. వెంటనే ముక్కును తొలగించుకుంది.

దీనిని ప్రతిరోజూ రాత్రి వేళల నిద్రకు ఉపక్రమించే ముందు తీసివేసి, ఒక ప్లాస్టర్ ద్వారా ముక్కు రంద్రాలను కప్పి ఉంచుతుంది. ప్రతిరోజూ ఈ ముక్కు రంద్రాలను శుభ్రం చేయవలసి ఉంటుంది. దీనికి కారణం ప్రతి మనిషిలాగే మ్యూకస్ ఏర్పడుతుంది. అయినా ఆమె దాన్నేమీ పెద్ద సమస్యగా భావించి కృంగిపోకుండా తన జీవితాన్ని సంతోషంగా గడుపతోంది. తనమీదే తాను జోకులు వేసుకుంటుంది. ఎప్పటికప్పుడు తుమ్మినప్పుడు తన ముక్కు ఎక్కడ పడిపోయిందో అందరికీ చెప్తూ నవ్విస్తూ ఉంటుంది. చాలా మంది చిన్న చిన్న విషయాలకు సైతం ఏదో కోల్పోయిన భావనలో గడుపుతుంటారు. వాళ్ళకు ధీటుగా నిలబడుతోంది జేన్.