mictv telugu

కథానాయకుడు నష్టాన్ని మహానాయకుడితో తీరుస్తాం.. బాలకృష్ణ

February 14, 2019

ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ‘ఎన్టీఆర్-కథానాయకుడు’ సినిమా ఆశించిన విజయాన్ని చవిచూడలేకపోయింది. భారీగా అమ్ముడు పోయినప్పటికీ నష్టాలనే తెచ్చిపెట్టింది. దీంతో పంపిణీదారులు తీవ్రంగా నష్టపోయారు. సినిమాకు రివ్యూలు బాగానే వచ్చినప్పటికీ కలెక్షన్ల పరంగా సినిమా డిజాస్టర్‌గా మిగిలింది. దీంతో సినిమా నిర్మాతలు, కథానాయకుడు బాలకృష్ణ ఓ నిర్ణయం తీసుకున్నారు. ఈ సినిమాతో నష్టపోయిన పంపిణీదారులను ఆదుకోవాలని డిసైడ్ అయ్యారు. పంపిణీదారులందరికీ నష్టాల్లో మూడో వంతు చొప్పున నష్టపరిహారం చెల్లించాలని నిర్ణయించుకున్నారు.

Telugu news The NTR Katha nayakudu We will suffer loss by paid the Maha nayakudu. Balakrishna...

దీంతోపాటు కథానాయకుడు పంపిణీ చేసిన డిస్ట్రిబ్యూటర్లకే మహానాయకుడు పంపిణీ ఇస్తున్నారు . మహానాయకుడు వసూళ్లలోంచి 40 శాతం పంపిణీదారులకే ఇవ్వాలని నిర్ణయించినట్టు చిత్ర బందం అధికారికంగా ప్రకటించింది. Telugu news The NTR Katha nayakudu We will suffer loss by paid the Maha nayakudu. Balakrishna