శంషాబాద్ రూట్‌లో పెట్రోల్ ట్యాంకర్ బోల్తా - MicTv.in - Telugu News
mictv telugu

శంషాబాద్ రూట్‌లో పెట్రోల్ ట్యాంకర్ బోల్తా

February 24, 2018

శంషాబాద్ వెళ్ళే రోడ్డులో రాజేంద్ర నగర్ పరిధిలో శివరాంపల్లి వద్ద ఉదయం 4:30 గంటలకు పెట్రోల్ ట్యాంకర్ బోల్తా పడింది. పిల్లర్ నంబర్ 273 వద్ద ఈ ప్రమాదం సంభవించింది. డ్రైవర్ నిద్ర మత్తు వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు అంచనా వేశారు. డివైడర్‌ను ఢీకొట్టి రోడ్డు మీద పల్టీ కొట్టింది. ఎవరికి ఎలాంటి ప్రాణహాని జరగలేదు. కాగా ఫుల్‌ లోడ్‌తో ఉన్న ట్యాంకర్‌ బోల్తా పడటంతో రోడ్డు నిండా పెట్రోల్‌ లీకవుతోంది. దీంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. నిప్పు అంటుకుంటే మొత్తం ఏరియాకే అంటుకుంటుందని అందరూ భయపడుతున్నారు.సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది… వెంటనే సంఘటనాస్థలికి చేరుకుని పెట్రోల్‌ పారిన చోట నీళ్లు చల్లుతున్నారు. ఎలాంటి ప్రమాదం జరగకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించారు. సంఘటనాస్థలికి సమీపంలోని  స్థానికులను ఇళ్ళనుండి దూరంగా పంపించారు.  ట్రాఫిక్‌ను కూడా దారి మళ్లించారు. దీంతో మెహిదీపట్నం నుంచి ఆరాంగర్‌ రూట్‌లో ప్రయాణికులు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. పీవీఎక్స్‌ప్రెస్‌వే పైనా తాత్కాలికంగా రాకపోకలను నిలిపేశారు. కాగా ట్యాంకర్లో మిగిలిన పెట్రోల్‌ను తీసి వేరే ట్యాంకర్లో తరలిస్తున్నారు పోలీసులు.