ప్రియా ప్రకాశ్.. సొగసు చూడండి.. - MicTv.in - Telugu News
mictv telugu

ప్రియా ప్రకాశ్.. సొగసు చూడండి..

March 15, 2018

ప్రియా ప్రకాశ్ వారియర్ ఇప్పుడు ఏం చేసినా అది సంచలనమే క్రియేట్ చేస్తోంది. తాజాగా ప్రియ చేసిన ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గులాబీ గౌనులో ఏంజెల్లా మెరిసిపోయింది. రింగుల జుట్టుతో, ఓరకళ్ళ చూపుతో తన అభిమానులకు మరింత కనువిందు చేసింది. ‘ ఒరు ఆదార్ లవ్ ’ సినిమా విడుదలకు ముందు బోలెడంత పాపులారిటీని సొంతం చేసుకొని ప్రపంచాన్ని తన చుట్టూ తిప్పుకుంటోంది. కన్నుకొట్టి, ముద్దును గన్నులో పేల్చి ప్రేక్షక హృదయాలకు గాలం వేసిన ఈ కేరళాకుట్టికి అవకాశాలు వెల్లువలా ముంచుకొస్తున్నాయి.ఇప్పటికే తెలుగు రీమేక్ ‘ టెంపర్ ’ హిందీ ‘ సింబా ’లో రణ్‌వీర్‌సింగ్ సరసన నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అలాగే ఓ తెలుగు సినిమాలో నటించటానికి కూడా ప్రియా అంగీకరించినట్టు తెలుస్తోంది. కానీ ప్రియా మాత్రం తన సినిమా విడుదల అయిన తర్వాత తెర మీద తన నటన చూసుకున్నాకే ఇతర సినిమాల్లో నటిస్తానని ఆ మధ్య ప్రియ అన్న విషయం తెలిసిందే.

https://www.facebook.com/Priya.v.Offl/posts/153824955292484