ఆర్మీకి రాజకీయాలెందుకు?.. ఒవైసీ ధ్వజం - MicTv.in - Telugu News
mictv telugu

ఆర్మీకి రాజకీయాలెందుకు?.. ఒవైసీ ధ్వజం

February 22, 2018

ఆర్మీ చీఫ్  రాజకీయ అంశాల్లో జోక్యం చేసుకోరాదు. ఓ రాజకీయ పార్టీ అభివృద్ధిపై కామెంట్ చేయడం ఆర్మీ చీఫ్ పనికాదు ’ అంటూ ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్‌‌పై మజ్లిస్ నేత ఒవైసీ మండిపడ్డారు. అసోంలో మౌలానా బద్రుద్దీన్ అజ్మల్ నేతృత్వంలోని ఏఐయూడీఎఫ్(ఆల్ ఇండియా యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ ) విస్తరణపై  బిపిన్ చేసిన వ్యాఖ్యలపై  ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు.  ‘పార్టీలకు  రాజ్యాంగం, ప్రజాస్వామ్యం నుంచి అనుమతి ఉంది, ఆర్మీ చీఫ్  ఎన్నికైన పౌర నాయకత్వం కిందే పనిచేయాలి ’ అని ఒవైసీ సూచించారు.

ఈశాన్య భారతంలో సరిహద్దుల రక్షణపై ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో బిపిన్ వివాదాస్పదంగా మాట్లాడటంతో ఈ వివాదం చెలరేగింది. అసోంలోని పలు జిల్లాల్లో ముస్లిం జనాభా పెరుగుదలపై వచ్చిన నివేదికల నేపథ్యంలో బిపిన్ బుధవారం మాట్లాడుతూ…1980ల్లో బీజేపీ వృద్ధి కంటే ఏఐయూడీఎఫ్ వేగంగా వృద్ధి చెందిందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపాయి.