ప్రిన్సిపాల్ కాదు.. పిల్లల్ని కాటేసే కామపిశాచి - MicTv.in - Telugu News
mictv telugu

ప్రిన్సిపాల్ కాదు.. పిల్లల్ని కాటేసే కామపిశాచి

November 25, 2017

నీతి పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయుడే నీతి తప్పితే ఏమనాలి ? విద్యార్థులను కన్నబిడ్డల్లా చూసుకోవాల్సిన గురువే వారిని కాటేస్తే ఎలా సంబోధించాలి?  తన కూతురు వయసున్న విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించి ఉపాధ్యాయ వృత్తికే మచ్చ తెచ్చిన సంఘటన హైదరాబాద్  ఈసీఐఎల్‌లో ఆలస్యంగా  వెలుగు చూసింది. డీఏవీ పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకున్నది. 9 వ తరగతి చదువుతున్న విద్యార్థిని స్కూలు అయిపోయి ఇంటికి వెళ్ళిపోతున్నప్పుడు ఆమెను  ప్రిన్సిపాల్ మహాపాత్ర తన గదికి పిలిచాడు. స్నాక్స్, కూల్‌డ్రింక్ ఇచ్చి డోర్ వేశాడు. వెంటనే విద్యార్థినిని బలవంతంగా ముద్దు పెట్టుకున్నాడు. ఈ విషయం ఎవరి ముందూ చెప్పొద్దని ఒట్టు వేయించుకున్నాడు. అంతటితో ఆగకుండా ఈ విషయం బయటకు చెప్తే తీవ్ర పరిణామాలు ఎదర్కోవలసి వస్తుందని బెదిరించాడు.  ప్రిన్సిపాల్ చర్యకు హడలిపోయిన విద్యార్ధి మరుసటి రోజు పాఠశాలకు వెళ్ళడానికి భయపడిపోయింది. బాలిక భయపడుతున్న తీరును చూసిన ఆమె తల్లిదండ్రులు ఏమైందని ఆరా తీయగా అసలు విషయం బయట పడింది. వెంటనే బాలిక తల్లిదండ్రులు మహాపాత్రపై షీటీమ్స్‌కు, కుషాయిగూడా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు రంగప్రవేశం చేసి ప్రిన్సిపాల్‌ను అదుపులోకి తీసుకున్నారు.