ఏడేళ్ళ చిన్నారిపై ముసలి  ప్రిన్సిపల్ పైశాచికం - MicTv.in - Telugu News
mictv telugu

ఏడేళ్ళ చిన్నారిపై ముసలి  ప్రిన్సిపల్ పైశాచికం

December 4, 2017

‘ చెట్టుకు చీర కట్టినా కామంతో చెలరేగిపోతాడు కామాంధుడు ’ అన్నట్టే తయారైంది వ్యవస్థ. మహిళలనే గాకుండా అభం శుభం తెలియిని పసివాళ్ళ మీద కూడా కామాన్ని ప్రదర్శించిన ఓ ప్రిన్సిపల్ పైశాచికత్వం తాజాగా బయటికొచ్చింది. తన పాఠశాలలో చదువుతున్నతన మనవరాలు వయసున్న ఏడేళ్ల చిన్నారిపై కాని పనికి ఒడిగట్టిందే గాక, మీడియా ముందు తన తప్పును ఒప్పుకొని, నేను చాలా చిన్న తప్పు చేశానని తననితాను సమర్థించుకొన్నాడు. జార్ఖండ్‌లోని కోడెర్మా జిల్లాలో ఈ ఘటన జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఎస్ జేవియర్ అనే పాఠశాల ప్రిన్సిపాల్, యూకేజీ విద్యార్థినిని స్కూలు టాయిలెట్‌లోకి తీసుకెళ్లి, బట్టలు విప్పదీసి, తాకకూడని చోట తాకుతూ గట్టిగా కొరుకుతూ తనలోని పైశాచికత్వాన్ని ప్రదర్శించాడు.బాలిక ఏడుస్తుంటే చాక్లెట్లు చేతిలో పెట్టి ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని బతిమాలి పంపించాడు. ఈ విషయాన్ని పాప ఇంట్లో చెప్పింది. దీంతో వాళ్ళు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, సదరు ప్రిన్సిపల్‌ను పోలీసులు అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశ పెట్టారు. మీడియా ముందు అసలేం తప్పు చేయనట్టు తేలికగా మాట్లాడాడు క్సేవియర్. ‘ అవును నేను ఆ పని చేశాను. కానీ అది నా దృష్టిలో పెద్ద తప్పు కానేకాదు. నేను పాపను బలాత్కరిస్తే మీరన్నట్టు అది పెద్ద తప్పు అవుతుంది. నేను నిజం చెబుతున్నాను. ఎలాంటి ఇంటర్ కోర్స్ కూడా జరగలేదు ’ అని చెప్పాడు. తాను ముసలివాడిని, గుండె జబ్బు వుందని, రాత్రుళ్ళు నిద్ర పట్టదని, ఇన్సోమ్నియా వ్యాధి కూడా వుందని రకరకాల జబ్బుల పేర్లు చెప్పుకుపోయి సానుభూతి పొందాలనుకున్నాడు. ఈ కేసులో 15 రోజుల నిమిత్తం అతణ్ణి రిమండ్‌కు పంపి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.