రకుల్ యాప్.. ఫ్యాన్స్‌తో బోలెడు కబూర్లు పంచుకుంటుంది - MicTv.in - Telugu News
mictv telugu

రకుల్ యాప్.. ఫ్యాన్స్‌తో బోలెడు కబూర్లు పంచుకుంటుంది

March 21, 2018

రకుల్ ప్రీత్ సింగ్ తన అభిమానులకు మరింత చేరువ అవుతోంది. తన పేరుతో రూపొందించిన యాప్‌తో తన ఫ్యాన్స్‌తో బోలెడు కబూర్లు పంచుకోనుంది. అభిమానులతో తన కొత్త సినిమాల అప్‌డేట్స్ షేర్ చేసుకోవటం, ప్రత్యేకంగా వారితో మాట్లాడటానికి, తన ఫిట్‌నెస్ రహస్యాలను ఎప్పటికప్పుడు తెలియజేయటానికి ఈ యాప్‌ రూపొందింది. న్యూయార్క్‌కు చెందిన ఎస్కేపెక్స్‌ టెక్నాలజీస్‌ దీనిని రూపొందించగా మంగళవారం దీనిని రకుల్ ఆవిష్కరించింది.ఈ సందర్భంగా రకుల్ యాప్‌లోని తన ఫోటోలను చూపించి సందడి చేసింది. ఈ కార్యక్రమంలో ఎస్కేపెక్స్‌ చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌ షామిక్‌ తాలూక్‌దార్‌ పాల్గొన్నారు.