గాలి పని చేసిన రిపబ్లిక్ టీవీ... అంత తొందరైతే ఎట్ల - MicTv.in - Telugu News
mictv telugu

గాలి పని చేసిన రిపబ్లిక్ టీవీ… అంత తొందరైతే ఎట్ల

April 24, 2018

రిపబ్లిక్ టీవీ అంటే ఒక సంచలనం. ఈ మధ్య కాలంలో శాటిలైట్ న్యూస్ ఛానల్స్‌లో రిపబ్లిక్ టీవీకి వచ్చినంత పాపులారిటీ ఏ ఛానల్‌కూ రాలేదని చెప్పాలి. వార్తను చెప్పడం కంటే కడగడం అంటే వాళ్ళకు ఇష్టం. అయితే ఎంతటివాళ్ళైనా పప్పులో కాలు వేయక తప్పదు. కర్ణాటక ఎన్నికల సీట్ల పంపిణీకి సంబంధించిన వార్తను ప్రసారం చేస్తున్న సందర్భంలో గాలి జనార్ధన్ రెడ్డి ఫోటోకు బదులుగా మరో ఫోటోను వాడారు. హైదరాబాద్ జీహెచ్ఎంసీ కమీషనర్ పేరు కూడా జనార్ధన్ రెడ్డే కావడంతో పొరపాటున గాలి పని చేసేశారు.

గాలి జనార్ధన్ రెడ్డి ఫోటోకు బదులుగా జీహెచ్ఎంసీ కమీషనర్ ఫోటోను ప్రసారం చేశారు. జీహెచ్ఎంసీ కమీషనర్‌తో పాటు మేయర్ బొంతు రామ్మోహన్ వున్న ఫుటేజ్‌ను గాలిలోకి వదిలారు. రాజకీయ అవగాహలేనివారు ఇన్‌పుట్ ఎడిటర్లుగా, బ్యూరో చీఫ్‌లుగా, పీసీఆర్, ఎంసీఆర్ ఇన్‌ఛార్జులుగా వుంటే ఒక ఫోటో బదులు ఇంకో ఫోటో పడే ఛాన్స్ వుంటుంది. ఇదిలా వుంటే జీహెచ్ఎంసీ కమీషనర్‌కు రిపబ్లిక్ టీవీ పైన పరువు నష్టం దావా వేస్తే బాగుంటుందని దగ్గరివారు సలహా ఇచ్చినట్టు సమాచారం. కేసులు గీసుల జోలికి పోకుండా చేసిన తప్పును తెలుసుకుని రిపబ్లిక్ టీవీ జీహెచ్ఎంసీ కమీషనర్‌కు క్షమారపణలు చెప్తే బాగుంటుంది.