ఎక్కడైనా రోడ్డు చోరీకి గురైన సంఘటన గురించి విన్నామా ? అత్యంత ఆశ్చర్యానికి గురి చేస్తున్న ఈ సంఘటన తూర్పు చైనాలో జరిగింది. వింత దొంగకు నిదర్శనంగా నిలిచాడు ఝూ అనే ప్రబుద్ధుడు. 800 మీటర్ల పొడవైన రోడ్డును ఇతగాడు రాత్రికి రాత్రే చోరీ చేశాడు. జియాంగ్సూ ప్రాంతంలో రాత్రికి రాత్రే రోడ్డును తవ్వేసి కాంక్రీట్‌ను తరలించేందుకు ఒక ట్రాక్టర్‌ను పిలిచాడు. ఆ రోడ్డుపై తవ్వకాలు సాగించి కాంక్రీట్ స్టోన్ మెటీరియల్‌ను ఫ్యాక్టరీకి తరలించి అమ్మేశాడు.దీనిని గమనించిన గ్రామస్తుుల పోలీసులకు రోడ్డు కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. అయితే ఎటువంటి ముందస్తు ప్రకటన లేకుండా ఇక్కడి రోడ్డు మరమ్మతు పనులు జరిగాయి. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఝూను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులకు చిక్కిన ఝూ మాట్లాడుతూ ‘డబ్బు సంపాదించేందుకు రోడ్డు తవ్వి కాంక్రీంట్ను అమ్ముకున్నాను. ఈ క్రమంలో ఎవరూ అంతగా వినియోగించని రహదారి కనిపించింది. దీంతో రోడ్డు తవ్వేసి కాంక్రీట్‌ను ఫ్యాక్టరీకి అమ్మేశాను ’ అని చెప్పడంతో పోలీసులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ వార్త తెలిసి ‘ ఈ దొంగ చాలా స్మార్ట్ గురూ.. ఇన్నోవేటివ్ ఐడియాతో చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేస్తున్న ఇతను ధార్కారీ ’ అంటూ నెటిజనులు కామెంట్లు చేస్తున్నారు.