mictv telugu

నేటి నుంచి రెండో విడత నామినేషన్లు

January 11, 2019

గ్రామ పంచాయితీ ఎన్నికలకు నేటి నుంచి రెండో విడత నామినేషన్లు స్వీకరించనున్నారు. నేటి నుంచి 13 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 14న నామినేషన్ల పరిశీలన, అనంతరం వాలీడ్ నామినేటెడ్ అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు. 16న అప్పీలు చేసుకున్న నామినేషన్ పత్రాలపై విచారణ జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 17 వరకు గడువు విధించారు. అదే రోజు పోటీలో ఉన్న అభ్యర్థులకు గుర్తులు కేటాయిస్తారు. రెండో విడుత ఎన్నికలు జరుగనున్న గ్రామాల్లోనూ పలుచోట్ల ఏకగ్రీవం చేసేందుకు విస్తృతంగా సన్నాహాలు చేస్తున్నారు.Telugu news The second installment from today is the nominations4137 గ్రామ పంచాయతీలతో పాటు 36,620 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ 172 మండలాల్లో నామినేషన్ల స్వీకరణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 25న ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ జరుగనున్నది. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ నిర్వహించి ఎన్నికల అధికారులు ఫలితాలను ప్రకటించనున్నారు.