mictv telugu

ఆర్టీసీ బస్సులో చిరిగిన పట్టుచీర.. రూ.3వేలు ఫైన్ విధించిన కోర్ట్

January 28, 2019

గతేడాది ఆర్టీసీ బస్సులో చిరిగిన పట్టుచీరకు ఇప్పడు జరీమాన విధించింది కోర్టు. పట్టు చీరకు రూ. 2 వేలు, ఇతర ఖర్చులకింద మరో వెయ్యి రూపాయిలు జరిమానాను చెల్లించాల్సిందిగా ఆర్టీసీని ఆదేశించింది. వివరాల్లోకి వెళ్తే.. గతేడాది ఆగస్ట్ 26న నల్గొండకు చెందిన భార్యాభర్తలు కట్టెకోల నరసింహారావు, వాణిశ్రీలు కలిసి హైదరాబాద్‌లో బంధువుల ఇంట్లో జరుగుతున్న పెళ్లికి హాజరయ్యందుకు ఆర్టీసీ బస్సు ఎక్కారు. అయితే మహిళ బస్సు ఎక్కే క్రమంలో ప్రవేశ ద్వారం వద్ద బయటకు తేలిన రేకులో పట్టుచీర ఇరుక్కుని చిరిగింది. దీంతో వాణిశ్రీ ఆ రేకునే సరిచేయాల్సిందిగా బస్సు డ్రైవర్‌ను కోరింది. దానికి డ్రైవర్ చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. అది తమ పనికాదని, అది డిపో వ్యవహారమని చెప్పాడు.Telugu news The Silk saree was shattered in the RTC bus… Rs 3,000 fine imposed courtదీంతో వాళ్లు నేరుగా డిపో మేనేజర్‌ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఆయన కూడా డ్రైవర్ మాదిరే వీళ్లను పట్టించుకోలేదు. ప్రయాణికుల పట్ల ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా అని ఆ దంపతులు.. వారు ప్రయాణించిన బస్సు టికెట్, బయటకు తేలిన ఇనుప రేకు, బస్సు ఫొటోలు తీసుకున్నారు. వాటిని తీసుకెళ్ళి నల్గొండలోని వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన ఫోరం ఆర్టీసీ బస్సులో లోపాలు నిజమేనని నిర్ధారించింది. పట్టు చీరకు రూ. 2 వేలు, ఇతర ఖర్చులకింద మరో వెయ్యి మొత్తం కలిపి రూ.3,000 జరిమానా విధించింది.