ప్రపంచంలోనే అత్యంత అందమైన పాప - MicTv.in - Telugu News
mictv telugu

ప్రపంచంలోనే అత్యంత అందమైన పాప

December 5, 2017

ఏ ప్రపంచ సుందరాంగి అయినా యుక్త వయస్సులో వుంటుంది. కానీ ఈ అందమైన పిల్ల వయసు ఎంత అనుకుంటున్నారు ? అక్షరాలా ఆరేళ్ళే. రష్యాకు చెందిన ఈ పాప పేరు అనస్తాసియా న్యాజెవా. నీలి కళ్ళు, గుండ్రటి ముఖం, ఎల్లప్పుడూ చిరునవ్వులు చిందించే ముద్దొచ్చే ముఖంతో ఈ పాపాయి ప్రపంచ మీడియా దృష్టిని తనవైపుకు తిప్పుకుంటున్నది.

ప్రపంచంలోనే అత్యంత అందమైన అమ్మాయిగా’ ప్రఖ్యాతి గాంచుతున్నది. ఈ అందమైన పాపకు సోషల్ మీడియాలో 5 లక్షల మంది ఫాలోవర్లు వున్నారు.  భవిష్యత్తులో టాప్ మోడల్‌గా రాణిస్తుందంటున్నారు నెటిజనులు.

‘OMG పత్రిక ఆమె భూమిపై అత్యంత అందమైన అమ్మాయి’ అని ప్రశంసల వర్షం కురిపించింది.  మరొక పత్రిక ‘అందాల కళ్ళున్న పాప, అందమైన రబ్బరు బొమ్ ’ అని కొనియాడింది. ప్రస్తుతం థైలేన్‌కు పెద్దపెద్ద కంపెనీల నుంచి  మోడలింగ్ ఆఫర్లు వస్తున్నాయి.

లారియల్ కోసం బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా ఎంపికయ్యింది ఈ చిన్న మోడల్. తన తల్లి నాకు అన్ని వేళలా తోడుండటం వల్లే నేను ఈ స్థాయికి చేరానేమో అనిపిస్తున్నదని అంటున్నది ఈ చిన్నది. అటు చదువు ఇటు మోడలింగ్ భివిష్యత్తును ఎలా బ్యాలెన్స్ చేసుకుంటుందో పాప.