తండ్రి రేపిస్ట్.. కూతురు ఆ ఘోరానికి వీడియో‌గ్రాఫర్! - MicTv.in - Telugu News
mictv telugu

తండ్రి రేపిస్ట్.. కూతురు ఆ ఘోరానికి వీడియో‌గ్రాఫర్!

December 16, 2017

ఆ తండ్రీకూతుళ్లు మానవత్వానికి, నాగరికతకు మాయని మచ్చ తెచ్చారు. మానవ సంబంధాలకు, విలువలకు గండికొట్టారు. ఫేక్ బాబా  గుర్మీత్ రాంరహీరం అలియాస్ డేారాబాబా – హనీప్రీత్‌లు తండ్రీ కూతుళ్లమని చెప్పుకుని  ఎన్నో దారుణాలు ఒడిగట్టడం తెలిసిందే. కానీ మనం చెప్పుకోబోతున్న  వీళ్ళు సొంత తండ్రీ కూతుళ్ళు అయి వుండి నోటితో చెప్పలేని, అక్షరాలతో రాయలేని దుర్మార్గాలు చేశారు.

హరియాణాలోని స్థానిక యమునా నగర్‌లో వుంటున్న వీరు వికృత చేష్టలకు ప్లాన్ గీసుకున్నారు. ఆ ప్లాన్‌లో భాగంగా కూతురు ముందు రంగంలోకి దిగి అందమైన పేదింటి అమ్మాయిలతో, డబ్బున్న అమ్మాయిలతో దోస్తీ చేస్తుంది. నమ్మకం కుదిరాక ఒక రోజు సాదరంగా ఇంటికి ఆహ్వానిస్తుంది. కాఫీలు, టీలు, కూల్‌డ్రింకులు ఇస్తుంది. కానీ వాటిలో మత్తు మందు కలిపి ఇస్తుంది. అది తాగిన వారు కళ్ళు తెరిచే సరికి జరగాల్సిన ఘోరం మొత్తం జరిగిపోతుంది.

వాళ్ళు మత్తులోకి జారుకోగానే కామంతో కళ్ళు మూసుకుపోయిన తండ్రి రంగంలోకి దిగి వారిపై అత్యాచారం చేస్తాడు. అలా తండ్రి అత్యాచారం చేస్తుంటే కూతురు వీడియో తీస్తుంది. వారు లేచాక ఆ వీడియోను చూపించి సోషల్ మీడియాలో పెడతామని బెదిరింపులకు దిగుతారిద్దరు. డబ్బులు డిమాండ్ చేస్తారు. తమ వీడియోలు ఎక్కడ బయటపడతాయోనని బాధిత మహిళలు వారికి డబ్బులిస్తారు. కొందరు మహిళలను బలవంతంగా వ్యభిచారంలోకి దించారు. వారు వ్యభిచారం చేసి సంపాదించే దాంట్లో తమకు వాటా ఇవ్వమని డిమాండ్ చేసేవారు. ఇలా బ్లాక్ మెయిల్ చేస్తూ బతకగం బాగా అలవాటైపోయింది వాళ్ళకి.

పాపం పండే రోజు ఒకటి వస్తుందంటారు ఇందుకేనేమో. ఈ తండ్రీ కూతుళ్ళ ఉచ్చులో పడ్డ ఓ మహిళ ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల రంగప్రవేశంతో వారి బండారం బయట పడింది. తండ్రీకూతుళ్లపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. బాధిత మహిళ మాట్లాడుతూ.. తాను ఈ దుర్మార్గులకు రూ. 10 వేలు ఇచ్చానని,  పదేపదే అడగటంతో పోలీసులను ఆశ్రయించానని చెప్పింది.