పాలాభిషేకంతో తడిసి ముద్దయిన స్పీకర్ - MicTv.in - Telugu News
mictv telugu

పాలాభిషేకంతో తడిసి ముద్దయిన స్పీకర్

March 31, 2018

దేవుళ్ళకు పాలభిషేకాలు, కుంకుమాభిషేకాలు చేయగా చూశాం. అలాగే అభిమాన హీరోలు, రాజకీయ నాయకుల కటౌట్‌లకు పాలాభిషేకాలు చేయగా చూశాం. కానీ బతికున్న మనిషికి పాలాభిషేకం చేయటం ఎక్కడైనా చూశామా ? లేదు కదూ.. ఆ రికార్డులను బద్దలు కొట్టిన మొట్ట మొదటి వ్యక్తిగా స్పీకర్ మధుసూదనాచారి నిలబడతున్నారు.ఆయనకు ఆ రికార్డును అందించిన ఘనులుగా వరంగల్ జిల్లా శాయంపేట మండల ప్రజలు చరిత్రలో నిలబడిపోతున్నారు. ఇంతకీ స్పీకర్ గారికి పాలాభిషేకం ఎందుకు చేశారంటే.. కొత్తగా గ్రామ పంచాయితీల ఏర్పాటును స్వాగతిస్తూ మండల ప్రజలు, నాయకులు, కార్యకర్తలు తమ ఆనందాన్ని ఇలా స్పీకర్‌పై అభిషేకం రూపంలో వ్యక్తపరిచారన్నమాట. బిందెడు పాలు పోసాక, పాల ప్యాకెట్లు కూడా స్పీకర్‌పై అభిషేకించారు.