అమెరికాలో తెలుగు మహాసభల సన్నాహాలు - MicTv.in - Telugu News
mictv telugu

అమెరికాలో తెలుగు మహాసభల సన్నాహాలు

November 20, 2017

హైదరాబా‌ద్‌లో డిసెంబర్ 15 నుండి 19 వరకు నిర్వహించనున్న ప్రపంచ తెలుగు మహాసభల సన్నాహక సదస్సును  శనివారం అమెరికాలోని  కాలిఫోర్నియా బే ఏరియాలో నిర్యహించారు. ఎన్నారై కోఆర్డినేటర్ మహేశ్ బిగాల ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.‘తెలుగు భాషా, సాహితీ వైభవాన్ని ప్రపంచమంతా చాటేలా తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలను విజయవంతం చెయ్యాల్సిన బాధ్యత మనందరిపైనా వున్నది. ప్రపంచం మొత్తం తిరుగుతూ ఈ మహాసభలకు తెలుగు భాషాభిమానులను, సాహితీ ప్రియులను, తెలుగు వారిని, తెలుగు భాషాభిమానులను ఈ సదస్సుకు ఆహ్వానిస్తున్నాం. అత్యంత అట్టహాసంగా ఈ సభలను నిర్వహిస్తున్న సీఎం కేసీఆర్‌కు తెలుగుజాతి రుణపడి వుంటుంది’ అని చెప్పారు.

విజయ్ చవ్వా, పూర్ణ బైరిలు సమన్వయకర్తలుగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో  ఎస్‌టీఏ,  టీడీఎఫ్,  టీఆర్‌ఎస్ యూఎస్‌ఏ, బీఏటీఏ,  టీసీఏ, సిలికాన్ ఆంధ్ర, వీటీఏ,టీఏటీఏ, టీఏఎన్‌ఏ, ఏటీఏ, సాన్ రామన్ ఫ్రెండ్స్, తెలంగాణ జాగృతి హెచ్‌ఎస్‌ఎస్, డీఎన్‌ఎఫ్ సంఘాల ప్రతినిధులు, కళాకారులు, తెలుగు రచయితలు పాల్గొన్నారు.