దొంగ నా కొడుకు జున్నుగాడు అంటున్న నాని - MicTv.in - Telugu News
mictv telugu

దొంగ నా కొడుకు జున్నుగాడు అంటున్న నాని

March 29, 2018

గతేడాది మార్చి 29న తండ్రి ప్రమోషన్ అందుకున్నాడు హీరో నాని. అప్పుడే తన కొడుక్కి ఏడాది వయసు నిండింది. తాజాగా త‌న త‌న‌యుడికి మొదటి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియ‌జేస్తూ ట్విటర్‌లో ఓ ఫొటో షేర్ చేశాడు. ఇందులో కార్లో కూర్చున్న నాని  త‌న‌ త‌న‌యుడిని ముద్దాడుతున్నాడు. ‘ దొంగ నా కొడుకు జున్నుగాడు ’ అని సరదాగా స్టేటస్ కూడా పెట్టాడు. త‌న‌యుడితో క‌లిసి దిగిన ఫోటోల‌ని అప్పుడప్పుడు సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తాడు నాని. ఈ ఫొటో తనకు చాలా స్పెషల్ అని చెప్పుకొచ్చాడు. బాల‌ల దినోత్స‌వం సంద‌ర్భంగా  పిల్ల‌లంద‌రికి హ్య‌పీ చిల్డ్ర‌న్స్ డే విషెస్ కూడా తెలిపాడు. ప్రస్తుతం నాని ‘ కృష్ణార్జున యుద్ధం ’ సినిమాలో నటిస్తూ బిజీగా వున్నాడు. ఈ సినిమా తర్వాత హను రాఘవపూడితో సినిమా చేస్తున్నట్టు తెలుస్తోంది.