విషాదం…ఓటు వెయ్యడానికి స్వగ్రామానికి వెళ్తూ తిరిగిరాని లోకాలకు…

రేపు ఓట్లు కాబట్టి చాలా మంది ఓట్లు వెయ్యటానికి ఎక్కడున్నా తమతమ ఊళ్ళకు చేరుకుంటున్నారు. ఎంత దూరంగా వున్నా వెళుతున్నారు. అలా ఓటు వెయ్యటానికి బయలుదేరిన ఓ కుటుంబం ఓటు హక్కును వినియోగించుకోకుండానే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. కారులో ఐదుగురు హైదరాబద్ నుంచి వస్తుండగా కారు అదుపుతప్పి చెట్టుకు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా, ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండలం కొలుముంతల్‌పహాడ్‌ పంచాయతీ పరిధిలోని కేశ్యతండా వద్ద జరిగింది.Telugu news The tragedy.. Returning to the home village to vote ...Three killedపెద్దఅడిశర్లపల్లి మండలం పోల్కంపల్లికి చెందిన పోగుల సురేందర్‌రెడ్డి(55), పోగుల యాదమ్మ(50) భార్యభర్తలు. వీరు ఐదు రోజుల క్రితం హైదరాబాదులోని కూతురి ఇంటికి వచ్చారు. అక్కడ నివసిస్తున్న పోల్కంపల్లి గ్రామస్థులకు ఓటు వెయ్యడానికి గ్రామానికి రావాల్సిందిగా చెప్పారు. వీరి అల్లుడు తిప్పన వెంకట్ రెడ్డిది(35) పోల్కంపల్లి గ్రామమే. ఈయన పీఏపల్లి మండలంలో ఎన్నికల ప్రచారం చేశారు.

అందరికీ చెప్పి అత్తమామలు, స్నేహితుడు బొడ్డుపల్లి నర్సింహాచారి, అన్న కుమారుడు మహేందర్‌రెడ్డితో కలిసి బుధవారం సాయంత్రం హైదరాబాద్‌ నుంచి పోల్కంపల్లికి కారులో బయలుదేరారు. కేశ్యతండా వద్దకు రాగానే కారు అదుపుతప్పి విద్యుత్ స్తంభానికి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అవగా, యాదమ్మ అక్కడికక్కడే మృతిచెందారు. సురేందర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందారు.