‘నీదీ నాదీ ఒకే కథ’ ట్రైలర్ వచ్చేసింది - MicTv.in - Telugu News
mictv telugu

‘నీదీ నాదీ ఒకే కథ’ ట్రైలర్ వచ్చేసింది

March 16, 2018

మార్చి 23న విడుదలకు సిద్ధమవుతున్న ‘నీదీ నాదీ ఒకేకథ’ సినిమా ట్రైలర్ విడుదల అయింది. సామాన్యుడైన సెక్యూరిటీమ్యాన్ చేతులు మీదుగా ఈ సినిమా ట్రైలర్ విడుదల అవటం విశేషం. శ్రీవిష్ణు, ‘ బిచ్చగాడు ’ ఫేం సాత్నాటైటస్ జంటగా ఊడుగుల వేణు దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో మరో దర్శకుడు దేవీప్రసాద్ ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. నారారోహిత్ సమర్పణలో అరన్ మీడియా వర్క్స్ పతాకంపై ప్రశాంతి, కృష్ణ విజయ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

మైక్‌టీవీ పాటలతో పాపులర్ అయిన యువ సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. సినీమాటోగ్రఫర్లుగా రాజ్‌తోట, పర్వేజ్‌లు పని చేస్తున్నారు. హీరో పాత్ర చుట్టూ ఉండే ఎమోషన్స్ బలంగా కనిపిస్తున్నాయి. ఫ్యామిలీ డ్రామా.. ప్రధానంగా తండ్రీ-కొడుకుల మధ్య ఉండే అనుబంధాన్ని చాలా చక్కగా ఎలివేట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ‘ అప్పట్లో ఒకడుండేవాడు ’ తరువాత శ్రీవిష్ణు సోలో హీరోగా చేస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకులను అలరించనుంది.

తొలుతనుండీ ఈ చిత్రానికి వినూత్న తరహాలో పబ్లిసిటీ చేస్తున్నారు. కోలాటం కళాకారులతో చేసిన పాటలో ఈ చిత్రం గురించి చెప్పించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.