తండాల్లో గిరిజనులే సర్పంచులు.. వాళ్ళదే రాజ్యం - MicTv.in - Telugu News
mictv telugu

తండాల్లో గిరిజనులే సర్పంచులు.. వాళ్ళదే రాజ్యం

March 29, 2018

తెలంగాణలో ఉన్న 2637 తాండాలను ఇకనుంచి గిరిజనులే పాలించుకోవాలి.. ‘ హమారే తండామె హమారా రాజ్ ’ అని  గిరిజనులే సర్పంచులుగా తమ తండాలను అభివృద్ధి చేసుకోవాలి.. అంటూ శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు. తాము పంచాయతీలు, మున్సిపాలిటీలకు రూ.2500 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. తండాలను పంచాయతీలుగా మార్చే బిల్లును అసెంబ్లీలో బుధవారం ప్రవేశ పెట్టారు.కేంద్ర ప్రభుత్వాలు అవలంభించిన దుర్మార్గ విధానాల వల్ల గ్రామపంచాయతీలు అస్తవ్యస్తమయ్యాయని ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. గ్రామ పంచాయతీలను మురికికూపాలుగా మార్చారన్నారు. తాము ఆ పరిస్థితిని మార్చివేస్తున్నామన్నారు. సర్పంచ్ ఎన్నికల కోసమే కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితి వచ్చిందన్నారు. ఈ పరిస్థితిని మార్చేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. ప్రత్యక్ష పద్ధతిలోనే పంచాయతీ ఎన్నికలు ఉంటాయన్నారు. సర్పంచ్, ఉప సర్పంచ్‌కు ఉమ్మడిగా చెక్ పవర్ ఉంటుందని కేసీఆర్ తెలిపారు.