డైవర్షన్ ఆంటీపై టీవీ9 కన్ను పడింది.. - MicTv.in - Telugu News
mictv telugu

డైవర్షన్ ఆంటీపై టీవీ9 కన్ను పడింది..

April 24, 2018

డైవర్షన్ ఆంటీ.. ఈ పేరు వినటానికే చిత్రంగా వుంది కదూ. ఈమె గురించి మీకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు… ఈ సమస్త భూమండలాన్ని ఆదిశేషుడు తన పడగపైన మోస్తున్నట్లు ఓ కథ ఉంది. ఈవిడ కూడా అలాంటి విన్యాసాలే చేస్తూ ఉంటుంది. భూమికి, భూమిపై బతికి జనానికి తలెత్తే గండాలను తప్పించే బాధ్యతను మొత్తం తన భుజస్కంధాలపై వేసుకుని వాటి డైవర్ట్ చేస్తూ ఉంటానని చెబుతూ ఉంటుంది. గండం గురించి ఆమెకు ముందే తెలుస్తుంది.

శ్రీనిజ ఆమె అసలు పేరు.. అయితే నెటిజనులు ఆమెకు పెట్టిన పేరు డైవర్షన్ ఆంటీ. సౌమ్య, జయగా కూడా ఆమె పేర్లు పెట్టుకున్నారు. ఈమెను దాదాపు ఫేస్‌బుక్, వాట్సాప్ వీడియోల్లో చూసే వుంటారు. ఆమె కల వచ్చిందంటే ఎవరో ఒకరు ఖతమే. అయితే జరగబోయే విపత్తును ఆమె డైవర్ట్ చేస్తుంది! అందుకే ఆమెను డైవర్షన్ ఆంటీ అంటారు. పలు సినిమాల్లో నటించిన శ్రీనిజ ‘నా పెట్టె తాళం తీసి’ అనే ఐటెం సాంగులో కూడా నర్తించింది. హీరో రాle చనిపోతాడని ఈమెకు కల వచ్చిందట.. ఆ మరణాన్ని రామానాయుడి మీదకు మళ్లించానని చెప్పారు ఆంటీ. అలాగే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు పుష్కరాల్లో ప్రమాదం పొంచి వుందని దాన్ని డైవర్ట్ చేశానని చెప్పింది.

ఇలా చెప్పుకుంటూ పోతే ఆమె వివిధ ఇంటర్వ్యూలలో పలువురు సెలబ్రిటీల ప్రాణ గండాలను డైవర్ట్ చేశానని చెప్పింది. దేవుడు కనిపించి తనతో డైవర్ట్ చేయిస్తారని ఆవిడ అంటూ ఉంటుంది. ఎవరికి ప్రాణగండం వున్నా ఈమె ఆత్మ వెళ్ళి అక్కడ రక్షణగా వుంటుందని చెప్పడం ఆమెకే సాధ్యం. దివంగత ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోతున్నారని తనకు ఏడు రోజులు ముందుగానే తెలిసిందట. కానీ ఆమె వెళ్ళి రాజశేఖర్ రెడ్డికి చెప్పే ధైర్యం లేక చెప్పలేకపోయిందట. ఆయన చనిపోవడాన్ని తన అధైర్యంతో ఆపలేకపోయానని బాధపడటం ఆమెకే చెల్లింది.

క్యాస్టింగ్ కౌచ్..

తాజాగా కాస్టింగ్ కౌచ్ వ్యవహారంలో కూడా డైవర్షన్ ఆంటీ స్పందించారు. ‘అమ్మాయి పడుకుంటే వేషం వస్తుంది అనుకోవడం ఓ గుడ్డితనం. శ్రీరెడ్డి, రామ్ గోపాల్ వర్మలు మనుషులే కారు. సినిమా పెద్దలు వున్నారు కదా.. వాళ్ళను కలిసి సమస్య గురించి చెప్పాల్సింది కానీ చెప్పకుండా బట్టలు విప్పి శ్రీరెడ్డి తప్పు చేసింది.. దాని వల్ల జరిగే ఉపయోగం ఏమీ లేదు. కత్తి మహేష్, వర్మ, శ్రీరెడ్డిలు కలిసి పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేసి ఎన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా ఆయన వెంట్రుక కూడా వంకర కాదు ’ అని మండిపడ్డారు. దేవుణ్ణి ప్రార్థిస్తే కష్టాలను తప్పిస్తాడని ప్రచారం చేసుకుంది డైవర్షన్ ఆంటీ.

కాగా ఎంతోమందిని డైవర్షన్ చేస్తున్న శ్రీనిజ అలియాస్ డైవర్షన్ ఆంటీపై టీవీ9 కన్ను పడింది. ఆమె చెప్పేవన్నీ నిజాలేనా అనే కోణంలో ‘ డై.. వర్షన్ ’ డిబేట్ కార్యక్రమాన్ని ప్రసారం చేశారు. వారం రోజుల ముందే ఆమె మృత్యువును ఎలా కనుక్కుంటుంది అనే అంశంపై ఈ కార్యక్రమం జరిగింది. ఇందులో బాబు గోగినేని, ఆధ్యాత్మికవేత్త అనంతశర్మలు పాల్గొన్నారు.

ఆమెకు వచ్చిన కలను రికార్డు చేసి చెప్పగలిగితే నమ్మొచ్చు అన్నారు అనంత శర్మ. ‘విశ్వాసం అనేది మానవ మనుగడకు అవసరం.. సూచనాత్మకంగా వచ్చే కలలు కొన్ని వుంటాయి. అనారోగ్యానికి సంబంధించిన కలలు కొన్ని, గత జన్మల కలలు, భయాల మీద వచ్చే కలలు వున్నాయి. ఈ కలలు ఎందుకు వస్తున్నాయనేదానిపై  స్టడీ చేస్తే తప్పకుండా సమాధానం దొరుకుతుంది ’ అని పేర్కొన్నారు అనంత శర్మ. బాబు గోగినేని మాట్లాడుతూ.. ‘డైవర్షన్ ఆంటీ మానసిక రోగి. మనం రోజూ దేవుడితో మాట్లాడటాన్ని ప్రార్థన అంటాం.. ఏరోజైతే దేవుడు మనతో మాట్లాడతాడో అప్పుడు మనం పిచ్చి ఆసుపత్రికి వెళ్లాలి. శ్రీనిజ ఒకప్పుడు హిందూ దేవుళ్ళు అన్నారు.. ఇప్పుడు జీసస్ అంటున్నారు. అలా ఆమె చెప్తున్నట్టు జరగడం అసాధ్యం ’ అన్నారు బాబు గోగినేని. కాగా కార్యక్రమంలో వేణుస్వామి ఫోన్ చేసి బాబు గోగినేనిని తిట్టడం గమనార్హం.