మహిళా కానిస్టేబుళ్ళ యూనిఫాం ఇలా - MicTv.in - Telugu News
mictv telugu

మహిళా కానిస్టేబుళ్ళ యూనిఫాం ఇలా

April 3, 2018

తెలంగాణ రాష్ట్రంలో మహిళా కానిస్టేబుళ్ళు ఇప్పటివరకు ఖాకీ రంగు చీరల్లో, సల్వార్-కమీజ్‌లలో అనేక ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. ఇకనుంచి అలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేకంగా వారికోసం పోలీస్ శాఖ సరికొత్త డ్రెస్‌కోడ్‌ను డిజైన్ చేయించారు. ఇవి రెండు రకాలుగా డిజైన్ చేశారు.  ఈ డిజైన్లను ఆకాంక్ష మహేశ్వరి రూపొందించారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ పూర్వ విద్యార్థి అయిన ఆమె నగరంలోని ఐ-బ్రాండ్ సంస్థలో క్రియేటివ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నారు. నడుము వరకు ఉండే కోటుతో ప్యాంటు-చొక్కా, అలాగే నడుము వరకు ఉండే కోటుతో సల్వార్ కమీజ్ లాంటి రెండు డిజైన్లను రూపకల్పన చేశారు.అల్లర్లు జరిగినప్పుడు నిరసనకారులను అదుపుచేసే క్రమంలో మహిళా కానిస్టేబుళ్ళు కింద పడటం జరుగుతోందని ఈ నిర్ణయం తీసుకున్నట్టు రాష్ట్ర డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి వెల్లడించారు. కొత్త డ్రెస్ కోడుతో మహిళా కానిస్టేబుళ్లు తమ విధుల్లో ఎటువంటి ఇబ్బందులు ఫేస్ చెయ్యరనుకుంటున్నాం అన్నారు. దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు.