యూపీ సచివాలయానికి కషాయం రంగు - MicTv.in - Telugu News
mictv telugu

యూపీ సచివాలయానికి కషాయం రంగు

October 31, 2017

 

యూపీ ప్రభుత్వం సర్వం కాషాయం రంగును పులుముకుంటోంది. ఇప్పటికే బస్సులు, ప్రభుత్వ బ్రౌచర్లు, స్కూలు బ్యాగులు సైతం కాషాయం రంగులోకి మారిన సంగతి తెలిసిందే. తాజాగా యూపీ రాష్ట్ర సచివాలయానికి కూడా కషాయం రంగు వేస్తున్నారు.

సీఎం యోగీ ఆదిత్యానాథ్ ఆదేశాల మేరకే సెక్రెటేరియట్ బిల్డింగుకు కషాయం రంగు వేస్తున్నారు. ఈ కార్యాలయంలో సీఎంతో పాటు ప్రధాన కార్యదర్శులు, ఇతర అధికారులు వుంటారు. ఐదు అంతస్తులు గల ఈ భవనానికి కాషాయం అద్దే పనులు సాగుతున్నాయి. తొలుత ఈ బిల్డింగు తెలుపు రంగులో వుండేది.