రణరంగంలా మారిన సీబీఐటీ.. - MicTv.in - Telugu News
mictv telugu

రణరంగంలా మారిన సీబీఐటీ..

December 11, 2017

‘ ఐదు రోజులుగా ఆందోళన చేస్తున్నా యాజమాన్యం తమ గోడు పట్టించుకోవడంలేదని ’ సీబీఐటీ విద్యార్థులు వాదిస్తున్నారు. ఒక్కసారిగా పంచిన ఫీజులను తగ్గించాలని కోరుతూ గత ఐదు రోజులుగా సీబీఐటీ విద్యార్థులు ఆందోళనకు దిగారు.  వీరికి ఏబీవీపి సహా పలు విద్యార్థి సంఘాలు మద్దతు తెలిపాయి. కాలేజీ అంతా విధ్వంసకర వాతావరణం నెలకొన్నది.  కాలేజీ ఫర్నిచర్ కూడా ధ్వంసమైంది. ఈ క్రమంలో  ప్రిన్సిపల్ రూమ్‌లోకి చొచ్చుకుపోయిన విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు.శంకర్‌పల్లి చౌరస్తాలో సీబీఐటీ కాలేజీ బస్సులను ఏబీవీపీ అడ్డుకోవ‌డంతో ఈ ఉద్రిక్త‌త చోటు చేసుకున్నది. విద్యార్థుల‌ ర్యాలీలు, ధ‌ర్నాల‌తో ఆ ప్రాంతం మారుమోగిపోతోంది. 

ఈ క్రమంలో పోలీసులకు, విద్యార్థులకు మధ్య వాగ్వాదం కొనసాగింది. ఆందోళన ఎక్కువవుతూ పరిస్థితులు చేయి దాటి పోతుండటంతో పోలీసులు లాఠీచార్జ్ చేయవలసి వచ్చింది. తేరుకున్న కాలేజీ యాజమాన్యం  వారం రోజుల సెల‌వులు ప్ర‌క‌టించింది. మేనేజ్‌మెంట్‌తో మాట్లాడి పెరిగిన ఫీజులను తగ్గించే ప్రయత్నం చేస్తానని ప్రిన్స్‌పల్ తెలిపారు.