భార్యకు హెచ్ఐవీ వుందని గెంటేశాడు - MicTv.in - Telugu News
mictv telugu

భార్యకు హెచ్ఐవీ వుందని గెంటేశాడు

February 5, 2018

‘ నాతిచరామి ’ అంటూ పెళ్ళిరోజు వాగ్దానాలు చేసిన మొగుడు పెళ్ళాన్ని అర్థాంతరంగా వదిలేస్తే ఆ వాగ్దానానికి విలువ, అర్థమేమైనా వున్నాయా, అనిపిస్తుంది ఈ ఘటన గురించి తెలిస్తే. సదా తోడుంటానని చెప్పిన భర్త భార్యకు హెచ్‌ఐవీ సోకిందని తన ఇంటి నుంచి ఆమెను గెంటేశాడు. వరంగల్ జిల్లా భీమదేవరపల్లి మండలం,గొల్లపల్లిలో చోటు చేసుకుంది. తన భార్యకు హెచ్ఐవీ వ్యాధి సోకింది కాబట్టి నాకు భార్యా, బిడ్డ అవసరం లేదని ఇంటి నుంచి గెంటేశాడు. సదరు బాధితురాలు ఆమె తల్లిదండ్రులతో కలిసి మొగుడి ఇంటి ముందు నిరసన వ్యక్తం చేస్తోంది. తనకు న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించనని బాధితురాలు స్పష్టం చేసింది. ‘ ఎవరో చెప్పిన మాటలు నమ్మి నా మీద లేని రోగాన్ని అంటగట్టి నన్ను వదిలించుకోవాలని చూస్తున్నాడని ’ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నది.