నిజంగానే జగమంత కుటుంబం - MicTv.in - Telugu News
mictv telugu

నిజంగానే జగమంత కుటుంబం

October 23, 2017

జగమంత కుటుంబం నాది.. అనే పాట గుర్తుకొస్తుందా. అయితే చదవండి. అదో నాలుగంతస్తుల బంగ్లా. ఆ బంగ్లాలో  వంద గదులు.. అందులో181 మంది సంసారం.. . విచిత్రం మేమిటంటే వారంతా ఒకే కుటుంబానికి చెందినవారు. మిజోరామ్ రాష్ట్రంలోని బక్తాంగ్ అనే గ్రామంలో 72 జియోనా అనే ముసలాడి కుటుంబం అది. అతనికి ఏకంగా 39 మంది భ్యార్యలు, 94 మంది పిల్లలు, 14 మంది కోడళ్లు, 40 మనమలు, మనమరాళ్లు.

వీళ్లింట్లో ప్రతిరోజు ఓ పండుగే.  వీళ్ల తిండికోసం  ప్రతిరోజు వీళ్లింట్లొ పొయ్యిమీదికెల్లి, డేకీసలు దిగాల్సిందే. వీళ్ల ఒక్కరోజు తిండికి 50 కిలోల బియ్యం, 70 కిలోల మాంసం కావాలి.  జియోనాకు తాతలు సంపాదించిన ఆస్తి బాగా ఉండడంతో అంతమందిని పెళ్లి చేసుకున్నాడు. కుటుంబ నియంత్రణ పాటించకుండా ఏకంగా 94 మంది పిల్లలతో రికార్డ్ సృష్టించాడు. వీళ్లింట్లో ఏదైనా ఫంక్షన్ అయితే  చుట్టాలు ఎవ్వరూ రానవసరంలేదు.  ఎవరైనా ఏదైనా ఫంక్షన్‌కు, వీళ్ల కుటుంబాన్ని పిలిస్తే అంతే సంగతి.