మరో నిరుద్యోగి ఆత్మహత్య - MicTv.in - Telugu News
mictv telugu

మరో నిరుద్యోగి ఆత్మహత్య

December 7, 2017

తెలంగాణలో ఖాళీ కొలువులు  భర్తీ కావడం లేదంటూ మనస్తాంప చెందిన ఇద్దరు నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు మరవక ముందే మరో యువకుడు  బలన్మరణం చెందాడు.  వికారాబాద్‌ జిల్లాలో గురువారం ఈ విషాదం చోటు చేసుకుంది.

జిల్లాలోని తాండూరు మండలం వీర్‌సెట్టిపల్లి గ్రామానికి చెందిన చంద్రమోహన్‌ అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ‘ తెలంగాణ వచ్చాక ఉద్యోగాలు వస్తాయని ఆశతో వున్నాడు. ఇప్పటికీ ఉద్యోగం రాకపోయేసరికి తీవ్ర మనస్తాపానికి గురైన చంద్ర మోహన్ ఆత్మహత్య చేసుకున్నాడు’ అని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.