టాకీస్లు రేపటి నుంచి తెరుచుకుంటాయి! - MicTv.in - Telugu News
mictv telugu

టాకీస్లు రేపటి నుంచి తెరుచుకుంటాయి!

March 7, 2018

తెలుగు రాష్ట్రాల్లో వారం రోజులు నుండి పలు సిన్మా టాకీస్లు బంద్  కావడంతో సినీ ప్రేమికులు మళ్లీ టాకీస్లు ఎప్పుడు తెరుచుకుంటాయా? అని ఎదురు చూస్తున్నారు. అయితే డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లకు (డీఎస్‌పీ) దక్షిణాది సినీ నిర్మాతలకు మధ్య నెలకొన్న అంతరాలకు తెర పడింది.   వర్చువల్ ప్రింట్ ఫీ (వీపీఎఫ్) ఛార్జీలు, కట్ ఆఫ్ టైమ్ తగ్గింపు విషయంలో ప్రొవైడర్లు సినీ నిర్మాతలతో జరిపిన చర్చలు ఎట్టకేలకు సఫలీకృతం అయ్యాయి.

ఛార్జీల విషయంలో సౌత్ ఇండియన్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ (ఎస్ఐఎఫ్‌సీసీ) ఐక్య కార్యాచరణ సమితి (జాక్)-డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ల మధ్య గత కొన్ని రోజులుగా విభేదాలు మొదలయ్యాయి. అయితే సర్వీస్ ప్రొవైడర్లు సమ్మెకు దిగారు. దీనితో గత  వారం రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో 1700 సిన్మా టాకీస్లు మూత పడ్డాయి. అయితే చర్చలు సఫలం అవ్వడంతో రేపటి నుండి మూసుకున్న టాకీస్లు తెరుచుకోనున్నాయి. అయితే చర్చల్లో తీసుకున్న నిర్ణయం ప్రకారం కొత్త చార్జీలు ఏప్రిల్ 6 నుంచి అమలు కానున్నాయి.