పైసలు తీసి ఇస్తవా...నీ పెళ్లాం, బిడ్డల్ని చంపుమంటవా? - MicTv.in - Telugu News
mictv telugu

పైసలు తీసి ఇస్తవా…నీ పెళ్లాం, బిడ్డల్ని చంపుమంటవా?

January 31, 2018

ఇండోర్‌లో ఓ దొంగ రెచ్చిపోయాడు. ఓవ్యక్తి భార్యా బిడ్డలతో ఏటీయంలో డబ్బులు తీసుకోవడానికి వచ్చినపుడు దొంగ తుపాకీతో బెదిరిస్తూ డబ్బులు దోచుకున్నాడు.    ఈఘటన జరిగి చాాలా రోజులయ్యింది. కానీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏటీయంలోకి చొరబడిన దొంగ ఆ వ్యక్తి భార్యాబిడ్డలకు గన్ గురిపెట్టి ఏటీయంలోంచి డబ్బులు తియ్యు లేకపోతే నీ భార్యా, బిడ్డల్ను చంపేస్తాను అని బెదిరించాడు. అంతేకాదు అతని పర్సులో ఉన్న డబ్బును కూడా లాక్కొన్నాడు.

ఆ తర్వాత అక్కడినుంచి పరారయ్యాడు. ఈ ఘటన ఏటీయంలో ఉన్న సీసీ టీవీలో రికార్డ్ అయ్యింది. ఆ వ్యక్తి పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు సీసీటీవీ పుటేజ్ ఆధారంగా దొంగను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఏటీయం దగ్గర సెక్యూరిటీ కూడా లేకపోవడంతో దొంగ పని ఇంకా సులభమయ్యింది.