ఆసుపత్రుల్లో డాక్టర్లు లేరు.. ఆటోలోనే ప్రసవించిన మహిళ - MicTv.in - Telugu News
mictv telugu

ఆసుపత్రుల్లో డాక్టర్లు లేరు.. ఆటోలోనే ప్రసవించిన మహిళ

April 2, 2018

అడుగడుగునా ఆసుపత్రులు వున్నా డాక్టర్లు లేకపోవటంతో ఓ మహిళ ఆటోలోనే ప్రసవించింది. తల్లీ, బిడ్డ క్షేమంగానే వున్నా ఈ ఘటన చాలామందిని ఆలోచింపజేస్తోంది. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని కొరియా కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఎదుట చోటు చేసుకుంది.  పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళను ఆటోలో తీసుకొని వెళ్ళారు. దేవుడు వరిమిచ్చినా పూజారి కనికరించాలన్నట్టు ఆసుపత్రి వున్నా అందులో డాక్టర్లు లేరు. దీంతో మహిళను అదే ఆటోలో స్థానికంగా వున్న చాలా ఆసుపత్రులకు తిప్పారు. అన్నీ ఆసుపత్రుల్లో అదే పరిస్థితి ఎదురయింది వారికి. నొప్పులు ఎక్కువవుతున్నకొద్దీ వెంట వున్న కుటుంబ సభ్యులు చాలా ఆందోళన చెందారట.చివరికి ఆటోలోనే మహిళ కాన్పు అయింది. తల్లీ బిడ్డ క్షేమంగానే వున్నారు. ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్లు అందరూ ఒకేసారి కూడబలుక్కున్నట్టు ఎక్కడికి వెళ్ళారని విమర్శిస్తున్నారు. డాక్టర్లు పేషెంట్లకు ఎప్పుడూ అందుబాటులో వుండాలి గానీ ఇలా వుండకూడదంటున్నారు.