బాగా డబ్బులు దక్కే కొలువులు.. - MicTv.in - Telugu News
mictv telugu

బాగా డబ్బులు దక్కే కొలువులు..

November 20, 2017

ద్రవ్యోల్బణం కారణంగా చిన్నమొత్తాలకు విలువ లేకుండా పోతోంది. నెలకు వేలల్లో జీతాలు సంపాదించే రోజులకు కాలం చెల్లింది. మన దేశంలో నెలకు ఇప్పటికీ అత్యధిక మంది ప్రజల జీతాలు వేలు, లక్షల్లోనే ఉంటున్నాయి.మరోపక్క అమెరికా వంటి సంపన్న దేశాల్లో నెలకు కోటికి దగ్గరలో సంపాదిస్తున్నారు ఉద్యోగస్తులు. ఈ ఆసక్తికర విషయాన్ని అక్కడి జాబ్ సెర్చ్ ఇంజిన్ ‘ ఇన్‌డీడ్ ’ తెలిపింది. ఈ మధ్య ఒక సర్వే చేసి క్రింది జాబితాను విడుదల చేసింది. ఎక్కువగా సంపాదించే ఉద్యోగస్తులు టెక్, మెడికల్‌ రంగాల్లో ఉన్నట్లు తెలిపింది. ఏడాదికి లక్ష డాలర్లు (సుమారుగా రూ.65 లక్షలు) లేదా అంతకన్నా ఎక్కువ జీతం తీసుకునే ఉద్యోగస్తుల జాబితాను ఇండీడ్ వెలువరించింది. ఆ వివరాలు…

న్యూరాలజిస్ట్ 1.41 కోట్లు
సైకియాట్రిస్ట్‌ 1.26 కోట్లు
అనస్తీషియాలజిస్ట్‌ 1.12 కోట్లు
రేడియాలజిస్ట్ 1.09 కోట్లు
ఫిజీషియన్‌ 1.07 కోట్లు
డెంటిస్ట్ 1.02 కోట్లు
ప్రొడక్ట్‌ మేనేజ్‌మెంట్‌ డైరెక్టర్‌ 95.69 లక్షలు
సర్జన్‌ 91.49 లక్షలు
మెషీన్‌ లెర్నింగ్‌ ఇంజినీర్‌ 89.18 లక్షలు
సేల్స్‌ వైస్‌ ప్రెసిడెంట్ 88.18 లక్షలు
డేటా సైంటిస్ట్‌ 87.87 లక్షలు
చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్ 83.04 లక్షలు
ఆండ్రాయిడ్‌ డెవలపర్ 78.55 లక్షలు
సీనియర్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్ 77.79 లక్షలు
ఫుల్‌స్టాక్‌ డెవలపర్ 72.54 లక్షలు
యాక్చువరీ 72.39 లక్షలు
ట్యాక్స్‌మేనేజర్ 70.46 లక్షలు
ఆర్కిటెక్ట్ 67.58 లక్షలు
నర్స్‌ ప్రాక్టీషనర్‌. 67.03 లక్షలు