తెలంగాణ స్కూలు పిల్లలకు ఇక 6 గుడ్లు! - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణ స్కూలు పిల్లలకు ఇక 6 గుడ్లు!

March 10, 2018

పాఠశాల విద్యార్థులకు ఇప్పటివరకు అందిస్తున్న పౌష్టికాహార పరిమాణాన్ని పెంచాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తున్నట్లు ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి చెప్పారు. ఒక్కో విద్యార్థికి ఇప్పటివరకు వారానికి మూడు కోడిగుడ్లను అందిస్తుండగా దీనిని రెండింతలు చేసే ప్రతిపాదనను ముఖ్యమంత్రి కార్యాలయానికి నివేదించామని చెప్పారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఇకపై వారానికి ఆరు గుడ్లను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.ప్రధానోపాధ్యాయుల సదస్సులో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 23 లక్షల మంది విద్యార్థులకు మధ్యాహ్నభోజన పథకానికి గాను ప్రభుత్వం రూ. 200 కోట్లు ఖర్చు చేస్తోందని పేర్కొన్నారు. 7-10 తరగతి విద్యార్థులకు ఆరోగ్య, పరిశుభ్ర కిట్‌లను అందించే యోచనలో ప్రభుత్వం వుందని చెప్పారు. తాగునీటి సదుపాయం లేని స్కూళ్ళకు మిషన్ భగీరథ పథకం కింద నల్లా కనెక్షన్లు ఇవ్వాలని కూడా సంబంధిత అధికారులను ఆదేశించామని వెల్లడించారు.