రామోజీరావు గారూ.. మీ ఈటీవీ కంపౌండులో పురుగులున్నాయి - MicTv.in - Telugu News
mictv telugu

రామోజీరావు గారూ.. మీ ఈటీవీ కంపౌండులో పురుగులున్నాయి

April 3, 2018

నటి శ్రీరెడ్డి ఈసారి ఈనాడు సంస్థల అధినేత రామోజీరావును టార్గెట్ చేస్తూ పోస్ట్ పెట్టింది. విలువలకు, క్రమశిక్షణకు మారుపేరుగా వున్న ఈటీవీ కంపౌండులో అమ్మాయిల జీవితాలతో ఆడుకునే కొన్ని పురుగులు వున్నాయని శ్రీరెడ్డి ఆరోపించింది. రామోజీరావును కలిసే అవకాశం ఇస్తే ఆ పురుగుల  గురించి సవివరంగా చెప్తానని చెప్పింది. ‘ రామోజీ రావు గారు.. మీరు ఈటీవీని సంస్కారానికి నిదర్శనంగా మెయింటెయిన్ చేస్తున్నారు. ఒక్కసారి మిమ్మల్ని కలిసే అవకాశం నాకు ఇవ్వండి. మీ ఈటీవీలో మీకు తెలియని కొన్ని కుసంస్కార పురుగులు వున్నాయి. మీ పేరు చెప్పుకుని అమ్మాయిల జీవితాలతో ఆడుకునే పురుగులు అవి. వాటిని మీ కాంపౌండ్‌లో లేకుండా చేద్దురుగాని.మీ లాంటి పెద్దవారిని ఎలా చేరుకోవాలో నాకు తెలియదు. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. ఈటీవీ కోసం కార్యక్రమాలను రూపొందించే అనిల్ అనే వ్యక్తికి అమ్మాయిలంటే ఏ మాత్రం రెస్పెక్ట్ లేదు. తనకున్న పవర్‌తో వెబ్ ఛానల్‌లో వచ్చిన వీడియోస్‌ని బలవంతంగా తెప్పిస్తున్న ఇలాంటి వాళ్లని వెంటనే నిర్మూలించకపోతే మీ ఛానల్ పరువు దిగజారిపోవటం ఖాయం ’ అంటూ శ్రీరెడ్డి తన ఫేస్‌బుక్ ఖాతా ద్వారా ప్రకటించింది. ఇలా వరుసగా శ్రీరెడ్డి ఒక్కొక్కరి గురించి బయటపెట్టడంతో మేకవన్నె పులుల గురించి మాకు తెలుస్తోందని కామెంట్లు చేస్తున్నారు.