క్రిస్‌మస్ ఐబ్రోస్ ట్రీ భలే వుంది - MicTv.in - Telugu News
mictv telugu

క్రిస్‌మస్ ఐబ్రోస్ ట్రీ భలే వుంది

December 8, 2017

ఇంకా క్రిస్‌మస్ రానేలేదు.. అప్పుడే క్రిస్‌మస్ ట్రీకి ధీటుగా ‘ ఐబ్రోస్ ట్రీ ’ తో కొందరు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నారు.  

చాలా మంది యువతులు తమ ఐ బ్రోస్‌ను క్రిస్‌మస్ ట్రీ బ్రోస్‌గా మార్చుకుంటున్నారు. ఇదో వినూత్నమైన ఆలోచన. కనుబొమ్మలను క్రిస్‌మస్ ట్రీ మాదిరి మార్చి, వాటికి స్టార్ ఆకారంలో, పువ్వుల మాదిరి వున్న రంగురంగుల చమ్కీలు అంటించి కంటి మీద క్రిస్‌మస్ ట్రీ మాదిరే ఈ ఐబ్రోస్ ట్రీలను తమ ముఖాల్లో అవిష్కరించుకుంటున్నారు యువతులు.

ఈ ఐబ్రోస్ ట్రీను ఎలా తయారు చేయవచ్చో ఇన్‌స్ట్రాగ్రామ్‌లో షేర్ చేసిన  వీడియోలో చూపించారు. ఇన్ని రోజులూ పండగప్పుడు క్రిస్‌మస్ ట్రీను ఇళ్ళల్లో, బయటా చూసాం. ఈ పండగ నుండి కొందరి ముఖాల్లో క్రిస్‌మస్ చెట్టును చూడబోతున్నామన్నమాట.