మరో బాబా రాసలీల - MicTv.in - Telugu News
mictv telugu

మరో బాబా రాసలీల

October 26, 2017

 కర్ణాటకలో ఒక బాబా వికృత రూపం బయటపడింది. కన్నడ మీడియాలో ఇప్పుడీ బాబా గారి రాసలీలకు సంబంధించిన వీడియో కన్నడ మీడియాలో పెను కలకలమే సృష్టిస్తోంది.

నంజేశ్వర స్వామిజీ అలియాస్‌ దయానంద్‌ అనే బాబా ఓ యువతితో అభ్యంతరకర స్థితిలో వున్న ఫోటోలు, వీడియోలు చర్చనీయాంశంగా మారాయి. కర్ణాటకలోని ఎల్హంక ప్రాంతంలోని మద్దెవనపుర మఠ ఆశ్రమంలో ఇది చోటు చేసుకున్నట్లు సమాచారం. ఈ బాబా ప్రస్తుతం ఓ మఠ బాధ్యతలను నిర్వహిస్తున్నాడు. పర్వతరాజ్‌ శివాచార్య స్వామి నుంచి వారసత్వంగా బాధ్యతలు తీసుకున్న ఆయన తనయుడు నంజేశ్వర స్వామి.

అయితే ఈ వీడియోలో బాబాతో వున్నది ఓ నటి అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరో సీక్రెట్‌ కెమెరాలతో ఆయన భాగోతాన్ని బయటపెట్టారు. స్వామీజీతో వున్న ఆ నటి ఎవరన్న వివరాలు తెలియాల్సి వుంది. ఇదిలా వుండగా ఆ మఠానికి సంబంధించి భూవివాదంలో కూడా స్వామీజీ వున్నాడట. దయానంద్ రాసలీలలు ఇప్పుడు కొత్తేం కాదంటున్నారు ఆయన అనుచరులు. ట్రస్ట్ సభ్యులు దయానంద్‌ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు