ఏడేళ్ల బాలికపై పెళ్లిలో  రేప్, హత్య.. - MicTv.in - Telugu News
mictv telugu

ఏడేళ్ల బాలికపై పెళ్లిలో  రేప్, హత్య..

April 17, 2018

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కథువా గ్యాంగ్‌రేప్ ఘటన గురించి మరిచిపోక ముందే మరో ఘోరం జరిగింది. ఏడేళ్ల బాలికపై 18 ఏళ్ళ దుర్మార్గుడు ఎత్తుకెళ్లి అత్యాచారం చేసి చంపాడు. అత్యంత హృదయవిదారకమైన ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది.  ఈటా జిల్లాలోని కొత్వాల్ నగర్  గ్రామంలో పెళ్లి వేడుక జరుగుతోంది. అక్కడికి తల్లిదండ్రులతో వచ్చిన బాలిక మీద కన్నేశాడు సోను. ఒంటరిగా వున్నప్పుడు మెల్లగా ఆమెను ఎత్తుకుని వెళ్ళాడు. పెళ్ళి వేడుక  సందర్భంగా పెద్ద ఎత్తున శబ్దాలు వుండడంతో బాలిక కేకలు పెద్దలకు వినిపించలేదు. పక్కనే నిర్మాణంలో వున్న ఓ భవంతిలోకి తీసుకువెళ్ళి అత్యాచారం చేసి చంపాడు. పెళ్లి తర్వాత బాలిక కనిపించకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు ఊరిలో వెతకడం ప్రారంభించారు. అక్కడికి దగ్గరగా  నిర్మాణంలో ఉన్న ఆ ఇంట్లో బాలిక మృతదేహాన్ని చూసి కుప్పకూలిపోయారు. బాలికను చంపిన సోను బాలిక మృతదేహం పక్కనే తాగి పడి వున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సోనూను అదుపులోకి తీసుకున్నారు. పోస్కో చట్టం కింద అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వరుసపెట్టి పసిపిల్లలపై జరుతున్న దారుణాలను చూసి చాలా మంది తల్లదండ్రులు బిక్కుబిక్కుమంటున్న సందర్భాలు నెలకొని వున్నాయి.