నన్ను వాడుకోవడానికి వైసీపీ ప్లాన్ వేసింది.. శ్రీరెడ్డి - MicTv.in - Telugu News
mictv telugu

నన్ను వాడుకోవడానికి వైసీపీ ప్లాన్ వేసింది.. శ్రీరెడ్డి

April 19, 2018

కాస్టింగ్ కౌచ్‌పై పోరాడుతున్న తనను రాజకీయంగా వాడుకోవాలని వైసీపీ పెద్ద ప్లాన్ వేసిందని శ్రీరెడ్డి ఆరోపిస్తోంది. శ్రీరెడ్డికి సంబంధించిన ఓ ఫోన్ సంభాషణ ఇప్పుడు రాజకీయపరంగా కలకలం రేపుతోంది. తన స్నేహితురాలు, క్యారెక్టర్ ఆర్టిస్ట్, హిజ్రా అయిన తమన్నాతో శ్రీరెడ్డి ఫోన్‌లో మాట్లాడుతూ సంచలన విషయాలను బయట పెట్టింది. వైసీపీ నేతలు నా వెనుక పెద్ద ప్లాన్ వేశారని అంది. పోరాటం చేస్తున్న తనను వాడుకోవాలని ప్రయత్నిస్తున్నారని… నన్ను మరింత వివాదంలో ఇరికిద్దామని ప్రయత్నిస్తున్నారని తెలిపింది. తన ఏడుపు చూసి, వాళ్లు వెనక్కి తగ్గారని చెప్పింది.


కాగా ఈ ఆరోపణలను వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఖండించారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ‘శ్రీరెడ్డి వెనుకో..మరోరెడ్డి వెనుకో ఉండాల్సిన కర్మ వైసీపీకి లేదు. పోరాటాల నుంచి పుట్టింది వైసీపీ. ఏదైనా చెప్పాలంటే సూటిగా ఎదురుగానే మాట్లాడుతాం.. తప్పితే ఎవరి వెనకాల వుండము. ఇలాంటి వ్యాఖ్యలను ప్రజలు అస్సలు నమ్మవద్దు ’ అని విజ్ఞప్తి చేశారు. ఈమధ్య ఎవరు ఎలాంటి కాంట్రవర్సీ చేసినా దానిని వైసీపీకి లింక్ పెడుతున్నారు.. ఇది మంచి పద్ధతి కాదు అని మండిపడ్డారు.